టాలీవుడ్ లో అంతే సక్సెస్ ఉన్న వాళ్ళకే ఇక్కడ డిమాండ్. ప్రస్తుతం వెంకీ అట్లూరి పరిస్థితి అదే. ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి బాక్సాఫీస్ సక్సెస్ లతో పాటు ఇటీవల ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రంతో వెంకీ అట్లూరి ప్రస్తుతం సక్సెస్ ఫుల్ ట్రాక్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ దర్శకుడితో పని చేసేందుకు హీరోలు లైన్ లో ఉన్నారు. అయితే వెంకీ తన నెక్ట్స్ సినిమాను అక్కినేని హీరోతో చేసే ఆలోచనలో ఉన్నాడట. టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య తన మైల్‌స్టోన్ 25వ చిత్రం కోసం దర్శకుడిని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నట్లు ఫిల్మ్‌నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు చైతన్య కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
గత కొన్ని చిత్రాలుగా ఇతర భాషల హీరోలతో పని చేసిన వెంకీ ఈసారి ప్రాపర్ తెలుగు హీరోతో ఓ వైవిధ్యమైన కథను తెరకెక్కించాలని భావిస్తున్నారు. గతంలో తాను రాసుకున్న అనేక కథలను ముందుగా నాగ చైతన్యకే వినిపించానని వెంకీ అట్లూరి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ ఈ క్రేజీ కాంబినేషన్‌ను నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల అక్కినేని అఖిల్ కు లెనిన్ తో సూపర్ హిట్ ఇచ్చాడు నాగవంశీ. ఇప్పడు నాగ చైతన్య మైల్ స్టోన్ మూవీని నాగవంశీ టేకప్ చేసి వెంకీ అట్లూరితో మరో హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నడట నాగవంశీ.

