NTV Telugu Site icon

Naga Chaitanya: బీస్ట్ మోడ్ లోకి మారిపోయాడు… వర్కౌట్స్ చూస్తే మతి పోవాల్సిందే

Naga Chaitanya

Naga Chaitanya

అక్కినేని హీరోలు సూపర్ ఫిట్నెస్ తో ఉంటారు. కింగ్ నాగార్జున, అక్కినేని అఖిల్, యువ సామ్రాట్ నాగ చైతన్యల ఫిజిక్ చూస్తే సాలిడ్ గా ఉంటుంది. ముఖ్యంగా నాగ చైతన్యకి ఫిట్నెస్ పైన కాన్సెన్ట్రేషన్ ఎక్కువ… సినిమాలతో సంబంధం లేకుండా ఫిట్ గా ఉండడం, ప్రతి రోజూ జిమ్ కి వెళ్లడం నాగచైతన్యకి అలవాటైన పని. రోజు చేసే జిమ్ ని సినిమా కోసం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తూ… యూత్ కి కొత్త ఫిట్నెస్ గోల్స్ ఇస్తున్నాడు నాగ చైతన్య. కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన చందూ మొండేటితో ఒక భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు నాగ చైతన్య.

Read Also: Raghava Lawrence: చంద్రముఖి 2 విషయంలో లారెన్స్ హ్యాపీనేనట

గీత ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా జాలర్ల నేపథ్యంలో సాగనుంది. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా #NC23 అనే వర్కింగ్ టైటిల్స్ తో ప్రీప్రొడక్షన్ వర్క్ గ్రాండ్ గా జరుపుకుంటుంది. రియల్ ఇన్సిడెంట్ బేస్డ్ కథతో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం నాగ చైతన్య లాంగ్ హెయిర్ పెంచి కొత్తగా కనిపిస్తున్నాడు. తన ఫిజిక్ విషయంలో కూడా వెల్ బిల్ట్ బాడీతో కనిపించనున్న నాగ చైతన్య జిమ్ లో సాలిడ్ వర్కౌట్స్ చేస్తున్నాడు. ఆ ఫిజిక్ అండ్ లాంగ్ హెయిర్ లో నాగ చైతన్యని చూస్తుంటే… NC23 సినిమాపై భారీ హోప్స్ పెట్టుకోని నాగ చైతన్య ప్రిపేర్ అవుతున్నట్లు ఉన్నాడు. ఈ జిమ్ వీడియోస్ బయటకి వచ్చి అక్కినేని ఫ్యాన్స్ కి కిక్ ఇస్తుంది. మరి ఈ సినిమాతో నాగ చైతన్య పాన్ ఇండియా హిట్ కొట్టి సాలిడ్ కంబ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.

Read Also: Raviteja: ది ఈగల్ ఈజ్ కమింగ్…