Site icon NTV Telugu

Naga Chaitanya: నాగ చైతన్య-శోభితల పెళ్లి ముహూర్తం ఇదే.. డెస్టినేషన్ వెడ్డింగ్‌ అక్కడే!

Sobitha Nagachaitanya Marriage

Sobitha Nagachaitanya Marriage

Naga Chaitanya- Sobitha Wedding Date and Venue Details: సమంత నుంచి విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య శోభితతో డేటింగ్ చేస్తున్నాడు అనే వార్తలు తెర మీదకు వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ వీరిద్దరూ కొన్నాళ్ల క్రితం ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఇక నాగచైతన్య, శోభిత పెళ్లి ముహూర్తం సహా ఎక్కడ చేసుకోబోతున్నారు? అనేది కూడా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఆగస్టు 8న చైతన్య, శోభితల ఎంగేజ్ మెంట్ హైదరాబాద్ లోని అక్కినేని నాగార్జున నివాసంలో ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల మధ్య గ్రాండ్ గా జరిగింది. నాగ చైతన్య – శోభిత డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఒక పర్ఫెక్ట్ ప్లేస్ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది.

Samantha: ‘ప్రేమ’ గురించి సమంత కీలక ప్రకటన?

హైదరాబాద్ లో కాకుండా ఏదైనా బయట ప్రదేశంలోనే వీరి వివాహం జరుపుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. రాజస్థాన్‌, లేదా మధ్యప్రదేశ్ లాంటి చోట్ల రాయల్ స్టైల్ లో వీరి వెడ్డింగ్ చేసుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఇక్కడ కుదరని పక్షంలో విదేశాల్లో సైతం చేసుకునే ఆలోచన ఉన్నట్టుగా సన్నిహితుల నుంచి సమాచారం అందుతుంది. ఈ సంవత్సరం చివరిలో లేదా వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో నాగ చైతన్య, శోభితల వివాహం చేసుకునేందుకు కొన్ని ముహూర్తాలు కూడా సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. ఈ లోపు నాగ చైతన్య, శోభితల సినిమాల షూటింగ్స్ కూడా పూర్తవుతాయని డేట్స్ ఇబ్బందులు లేకుండా చూసుకున్న తరువాతే వాళ్ళు పెళ్లి విషయం మీద ఫోకస్ చేయబోతున్నారని చెబుతున్నారు. అయితే ఇదంతా ప్రచారమే కాగా నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయి అనేది అక్కినేని కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు.

Exit mobile version