NTV Telugu Site icon

Naga Chaitanya: లిఫ్టులో చైతూ-శోభిత.. అబ్బా ఎంత ముచ్చటగా ఉన్నారో!

Chai So

Chai So

Naga Chaitanya Sobhitha Dhulipalla Lift Photo goes Viral: నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల త్వరలోనే వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ముందుగా సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య పలు పర్సనల్ కారణాలతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన శోభితతో డేటింగ్ చేస్తున్నాడని ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ వీరిద్దరూ ఒక ఫైన్ డే ఎంగేజ్మెంట్ చేసుకొని షాక్ ఇచ్చారు. త్వరలోనే వీరి పెళ్లి ఘనంగా చేసేందుకు ఇరు కుటుంబ సభ్యులు ప్లాన్ చేస్తున్నారు.

They Call Him OG: అలాంటోడు వచ్చి అలా నిలబడ్డాడు అంతే సార్!!

ఇక తాజాగా నాగచైతన్య శోభిత ఇద్దరు కలిసి లిఫ్ట్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో ఉంది. ఈ మేరకు ఒక ఫోటోని నాగచైతన్య తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేశారు. దానికి ఎవ్రీథింగ్ ఎవరీ వేర్ ఆల్ ఎట్ ఒన్స్ అంటూ ఒక క్యాప్షన్ కూడా పెట్టారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ పోస్ట్ కి ఆయన కామెంట్ సెక్షన్ ఆఫ్ చేశారు. ఇక ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగచైతన్యతో ఉండగానే శోభితనే ఈ పిక్ తీసినట్టు కనిపిస్తోంది.

Show comments