NTV Telugu Site icon

Naga Chaitanya – Sobhita: పెళ్లి ఎక్కడో తెలిసిపోయింది!

Love

Love

అక్కినేని నాగచైతన్య గతంలో సమంతను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి సినిమాలోనే కలిసి నటించిన వీరిద్దరూ ఆ తర్వాత ప్రేమలో పడ్డారు పెద్దలను ఒప్పించి వివాహం కూడా చేసుకున్నారు. కానీ ఆ వివాహ బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. ఇద్దరు కలిసి మ్యూచువల్ గా డైవర్స్ కి అప్లై చేసి తీసేసుకున్నారు. అయితే డైవర్స్ విషయంలో ఎన్నో రకాల ప్రచారాలు జరిగాయి. సమంతదే తప్పు అని నాగచైతన్య అభిమానులు, నాగచైతన్యదే తప్పు అని సమంత అభిమానులు కామెంట్స్ చేశారు. కానీ అసలు ఏం జరిగిందనే విషయం ఇప్పటికే బయటకు రాలేదు. ఇదిలా ఉండగా నాగచైతన్య శోభిత ధూళిపాళ్లతో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ వారిద్దరూ ఈ మధ్యనే హైదరాబాద్ లో నాగార్జున నివాసంలో అత్యంత సన్నిహితుల మధ్య నిశ్చితార్థం చేసుకున్నారు. వీరిద్దరూ గత రెండేళ్ల నుంచి డేటింగ్ లో ఉన్నట్లు తాజాగా వెల్లడైంది.

Guruprasad: దర్శకుడు ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. రక్త వాంతులు?

ఇక ఇప్పుడు వీరి వివాహం డిసెంబర్లో జరగబోతోంది. ఇప్పటికే వీరి వివాహానికి సంబంధించిన పనులు మొదలయ్యాయి. నాగచైతన్య తన స్నేహితులకు వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డులు కూడా పంచుతున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి వీరి వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్ అయ్యే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది. ఏదైనా రాజస్థాన్ లాంటి ప్రాంతానికో లేక దుబాయ్ లాంటి ప్రాంతానికి వెళ్లి అత్యంత సన్నిహితుల మధ్య వివాహం చేసుకుంటారు అని అందరూ భావించారు. అయితే అందరికీ షాక్ ఇస్తూ అన్నపూర్ణ స్టూడియోస్ లో సిద్ధం చేస్తున్న ఒక స్పెషల్ కళ్యాణ మండపంలో వీరి వివాహం జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరోపక్క నాగచైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ సినిమా యూనిట్ నవంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ మీద క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది.

Show comments