నాగచైతన్య ఒక సాలిడ్ హిట్టు కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తండేల్ అనే సినిమా చేస్తున్నాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారుల నిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాని తెరకెక్కించారు. చందు మొండేటి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయి పల్లవి నటించింది. ఇక ప్రమోషన్స్ లో ఒక రేంజ్ లో దూసుకుపోతున్న ఈ సినిమా యూనిట్ ఖచ్చితంగా ఈ సినిమాతో హిట్ అందుకుంటామని బలంగా నమ్ముతుంది. ఇక అయితే ఈ సినిమా విషయంలో అనేక చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం నాగచైతన్య తన కెరీర్లో అత్యధిక సమయం వెచ్చించాడు. దాదాపు రెండు సినిమాలు చేయాల్సిన సమయంలో ఈ ఒక్క సినిమానే చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన డబుల్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అదేదీ నిజం కాదు అని తెలుస్తోంది.
NBK 111: గోపీచంద్ తోనే బాలకృష్ణ నెక్స్ట్.. అంతా సెట్!
ఇక ఈ సినిమా మీద నాగచైతన్య కావాలనే ఇంట్రెస్ట్ చూపించారు. తనకు సూట్ అయ్యే కథ అని నమ్మటమే కాదు ఖచ్చితంగా హిట్ కొడతామని నమ్మకం ఉండడంతో ఆయన అంత సమయాన్ని వెచ్చించినా కూడా రెమ్యునరేషన్ పెంచమని కానీ ఎక్కువ ఇవ్వమని కానీ అడగలేదట. మామూలుగానే ఆయన తీసుకునే పది కోట్లు ఛార్జ్ చేసినట్టు తెలుస్తోంది. నిజానికి తనకు మార్కెట్ కంటే ఎక్కువగానే ఈ సినిమాకి టీం ఖర్చు పెట్టింది, కాబట్టి ఈ విషయాలన్నిటి మీద ఆయన పెద్దగా పట్టించుకోలేదని సినిమా మీద మేకింగ్ మీదనే పూర్తిగా ఆయన ఫోకస్ చేశారని తెలుస్తోంది. ఈ సినిమాలో నాగచైతన్య ఒక మత్స్యకారుడి పాత్రలో నటించబోతున్నాడు. తండేల్ రాజు అనే పాత్రలో ఆయన కనిపించబోతున్నాడు. ఈ సినిమా ఇండియన్ సినీ హిస్టరీలో ఉన్న పది బెస్ట్ లవ్ స్టోరీస్ లో ఒకటిగా నిలవబోతోందని టీం భావిస్తోంది. ఇక ఫిబ్రవరి ఏడో తేదీన ఈ సినిమా తెలుగు సహా తమిళ, హిందీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.