అక్కినేని వారి ఇంట మరోసారి పెళ్లి భాజాలు మోగనున్నాయి. 2021 అక్టోబరు లో సమంతాతో విడాకులు తెలుసుకున్నాక నాగ చైతన్య సింగల్ గానే ఉంటున్నాడు. వరుస సినిమాలతో కెరీర్ పరంగా మరో మెట్టు ఎక్కేందుకు సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ గత కొన్ని నెలలుగా చైత్యన్య ఓ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడని పలు రకాలు వార్తలు వినిపించాయి. ఆ విషయమై పలు ఇంటర్వ్యూ లలో ప్రశ్నించగా ఆ వార్తలను కొట్టి పారేసాడు.
Also Read : NagaChaitanya : నేడే అక్కినేని నాగచైతన్య ఎంగేజ్‌మెంట్..పెళ్లికూతురు ఎవరంటే..?
కానీ నేడు వాటిని నిజం చేస్తూ బంధుమిత్రుల సమక్షంలో దైవ సాక్షిగా తన ప్రేయసి శోభిత ధూళిపాళ్ల చేతికి ఉంగరం తొడిగాడు అక్కినేని నాగ చైతన్య. కొన్ని సంవత్సరాల ప్రేమాయణం తర్వాత నాగ చైతన్య మరియు శోభిత ధూళిపాళ్ల ఈ రోజు నిశ్చితార్థం చేసుకున్నారు. శోభితతో వైవాహిక జీవితం పంచుకోబోతున్నాడు చైతన్య. అక్కినేని నాగార్జున, అఖిల్, అమలతో పాటు, ధూళిపాళ్ల కుటుంబాలకు చెందిన ముఖ్యులు, దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన అతి కొద్దీ మందిని మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఆడంబరానికి దూరంగా సాంప్రదాయాలకు దగ్గరగా వేదపండితుల సమక్షంలో ఈ నిశ్చితార్ధ వేడుక జరిగింది. ఈ వేడుకకు నాగ చైతన్య తల్లి లక్ష్మి కూడా హాజరయినట్టు తెలుస్తోంది. కొన్ని కారణాల రీత్యా ఎంగేజ్‌మెంట్‌కు మీడియాను అనుమతించలేదు. త్వరలోనే పెళ్లి డేట్ ఫిక్స్ చేసి వెల్లడించనున్నట్టు సమాచారం. నాగ చైతన్య ఎంతో ఇష్టపడి కొనుక్కున్న నివాసంలోనే ఎంగేజ్మెంట్ జరిగినట్టు తెలుస్తోంది. నాగచైతన్య శోభిత కలిసి పెళ్లి తర్వాత ఈ బంగ్లాలోనే ఉండబోతున్నారని, అందుకు తగ్గట్టుగా రీ మోడలింగ్ చేయించుకుంటున్నట్లు సినీ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.