NTV Telugu Site icon

Naga Chaitanya: గొప్ప మనసు చాటుకున్న నాగచైతన్య, శోభిత

February 7 2025 02 23t100138.048

February 7 2025 02 23t100138.048

నాగచైతన్య, శోభిత.. ఈ జంట ఒకటయ్యాక చాలా మంది వీరిద్దరిని ఆశీర్వదించగా.. మరి కొంత మంది విమర్శించారు. కానీ ఎవరు ఎలాంటి కామెంట్స్ చేసిన పట్టించుకోకుండా వారి జీవితం వారు సాగిస్తున్నారు. ఇక తాజాగా ఈ దంపతులు గొప్ప మనసు చాటుకున్నారు. హైదరాబాద్‌లోని సెయింట్ జూడ్ ఇండియా చైల్డ్ కేర్‌ను శనివారం వీరిద్దరు సందర్శించారు. అక్కడ క్యాన్సర్‌తో పోరాడుతోన్న చిన్నారులతో కాసేపు గడిపారు. సెంటర్‌లోని చిన్నారులతో సరదాగా మాట్లాడుతూ వారికి ధైర్యం చెప్పారు. ఆ చిన్నారులతో ఆడి పడడమే కాకుండా.. చై వారితో కలిసి డ్యాన్స్ చేస్తూ వారిలో ధైర్యం నింపారు. అలాగే కేర్ సెంటర్ సిబ్బందితో మాట్లాడి పిల్లల ఆరోగ్యం గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు.

Also Read: Puri Jagannadh: ఫ్లాప్‌లో ఉన్న డైరెక్టర్ తో మహేష్ సినిమా చేయడు: పూరి జగన్నాథ్

అలాగే అక్కడి చిన్నారులకు ప్రత్యేక బహుమతులు కూడా అందించి వారితో కలిసి ఫోటోలు దిగారు. ఇందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. నెటిజన్లు ఈ జంటను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తమ అభిమానం వ్యక్తం చేస్తూ, మంచి మనసు చాటుకున్న నాగచైతన్య-శోభితను అభినందిస్తున్నారు. విమర్శించిన వారు కూడా ఈ జంట పై ప్రశంసలు కురిపిస్తున్నారు.