కోలీవుడ్ మల్టీటాలెంటెడ్ స్టార్ ధనుష్ ఇటీవల “జగమే తందిరం” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆయన అభిమానులను బాగానే అలరించింది. ప్రస్తుతం “ది గ్రే మ్యాన్” అనే హాలీవుడ్ మూవీ చిత్రీకరణలో ఉన్న ఈ యంగ్ హీరో మరో రెండు వారాల్లో చెన్నైకి తిరిగి వస్తాడు. అతను చెన్నైకి తిరిగి వచ్చాక స్వల్ప విరామం తీసుకుని తన నెక్స్ట్ మూవీ “నానే వరువెన్” చిత్రీకరణ ప్రారంభిస్తాడు. తాజాగా “”నానే వరువెన్” దర్శకుడు సెల్వరాఘవన్ ఓ పిక్ ను షేర్ చేస్తూ సినిమా అప్డేట్ ఇచ్చారు. ఇందులో ధనుష్, సెల్వరాఘవన్ ఉన్నారు. “నానే వరువెన్” ఫోటోషూట్ సందర్భంగా ఈ చిత్రాన్ని తీశారు.
Read Also : ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 10’… కార్ల మధ్యలో కార్డి బీ!
“ఎగ్జైటెడ్” అంటూ ఈ పిక్ ను షేర్ చేసిన సెల్వరాఘవన్ ఆగష్టు 20న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుందని ప్రకటించారు. కలైపులి ఎస్ తను నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ కు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా… అరవింద్ కృష్ణ సినిమాటోగ్రాఫర్ గా చేయనున్నారు. మిగిలిన నటీనటులు, సిబ్బంది వివరాలు రాబోయే వారాల్లో ప్రకటిస్తారు. ఇక ధనుష్, సెల్వరాఘవన్ కాంబినేషన్ లో ఇంతకుముందు “కాదల్ కొండెయిన్, పుదుపేటై, మాయక్కం ఎన్నా” వంటి చిత్రాలు వచ్చాయి. “నానే వరువెన్” వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందనున్న నాల్గవ చిత్రం.
