NTV Telugu Site icon

Game Changer: నానా హైరానా కూడా వచ్చేసింది!

Hairana

Hairana

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10న రిలీజ్ అయింది. ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. భారీ అంచ‌నాల‌తో సంక్రాంతి సంద‌ర్భంగా విడుదలైన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టిన సంగతి తెలిసిందే. తొలిరోజున‌ వ‌ర‌ల్డ్ వైడ్‌గా ‘గేమ్ చేంజర్’ చిత్రం రూ.186 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించి అందరినీ ఆశ్చర్యపరచగా మొదటి రోజు ‘నా నా హైరానా’ పాట కనిపించకపోవడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. సాంకేతిక కారణాల వల్లే ‘నా నా హైరానా’ పాటను జోడించలేకపోయాని యూనిట్ క్లారిటీ ఇచ్చింది. అయితే నేటి నుంచి ఈ పాటను థియేటర్లో చూడొచ్చు అని యూనిట్ ప్రకటించింది. సినిమాలో ఈ పాటను యాడ్ చేసినట్టుగా చిత్రయూనిట్ తాజాగా ప్రకటించింది.

Cock Fights: రేపు ప్రారంభం కానున్న కోడి పందాలు.. పశ్చిమగోదావరి జిల్లాలో భారీ ఏర్పాట్లు!

ఇన్ ఫ్రా రెడ్ కెమెరాతో చిత్రీకరించిన ఈ పాటను ప్రేక్షకులకు ఐ ఫీస్ట్‌లా ఉండనుందని అంటున్నారు. రామ్ చ‌ర‌ణ్ రామ్ నంద‌న్‌, అప్పన్న పాత్ర‌ల్లో ఒదిగిపోయి ఓ వైపు స్టైలిష్‌గా, మ‌రో వైపు పెర్ఫామెన్స్‌తో అందరినీ ఆక‌ట్టుకున్నారు. రామ్ చరణ్ గ్రేస్ ఫుల్ స్టెప్పులు, చ‌ర‌ణ్‌-ఎస్‌.జె.సూర్య మ‌ధ్య ఉండే ఎగ్జ‌యిటింగ్ స‌న్నివేశాలకు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. గేమ్ చేంజ‌ర్ చిత్రానికి మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్‌, తిరు ఎక్స్‌ట్రార్డినరీ విజువ‌లైజేష‌న్ సినిమాను నెక్ట్స్ రేంజ్‌కి తీసుకెళ్లాయి. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు.

Show comments