అక్కినేని నాగార్జునకు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆయనపై మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తమ్మిడికుంట కబ్జా చేసి Nకన్వెన్షన్ నిర్మించడంపై సినీ హీరో అక్కినేని నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు. మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు ‘జనం కోసం’ అద్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి. ఫిర్యాదును స్వీకరించిన మాదాపూర్ పోలీసులు లీగల్ ఒపీనియన్‌కు పంపించారు. ఇటీవల నాగార్జునకు చెందిన N కన్వెన్షన్‌ను హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే.
Also Read : COOLI : వైజాగ్ షెడ్యూల్ ‘ కూలీ’ షూటింగ్ లో రజనీకాంత్ కు ఏమైంది..?
అక్కినేని నాగార్జునాకు చెందిన N కన్వెన్షన్ తుమ్మిడికుంట చెరువుకు చెందిన 3 ఎకరాల భూమి కబ్జా చేసి కట్టారని గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ఈ కన్వెన్షన్ కూల్చివేస్తారని ఆరోపణలు వచ్చాయి కానీ కార్యరూపం దాల్చలేదు. ఇటీవల ఈ అక్రమ నిర్మాణంపై మరోసారి ఫిర్యాదులు అందాయి. చెరువులు, కుంటలు ఆక్రమించి కట్టిన కట్టడాలను కూల్చి వేయాలని ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో దూకుడు పెంచిన హైడ్రా N కన్వెన్షన్ ను అప్పటికప్పుడు కూల్చివేశారు అధికారులు. తాజాగా మంత్రి కొండా సురేఖ అక్కినేని నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.నాగార్జున సదరు మంత్రిపై క్రిమినల్ & డెఫమేషన్ కేసు నమోదు చేసాడు. ఈ వివాదం ఇలా సాగుతుండగా ఇప్పుడు మరోసారి నాగార్జున పై కసిరెడ్డి భాస్కరరెడ్డి ఫిర్యాదు చేశారు. కొండా సురేఖ వివాదం పెద్దది కావడంతో ఇలా అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ అక్కినేని అభిమానులు మండిపడుతున్నారు. వరుస వివాదాలతో సతమతమవుతున్న నాగార్జున ఈ కేసులను ఎలా ఎదుర్కుంటారోనని టాలీవుడ్ వర్గాలు చర్చిస్తున్నాయి.