NTV Telugu Site icon

Mythri Movie Makers: శ్రీ తేజ్ కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ 50 లక్షల ఆర్థిక సాయం

Sritej

Sritej

సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ను పుష్ప 2 నిర్మిత నవీన్ తో కలిసి సినిమా ఫొటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి పరామర్శించారు. ఈ విషయాన్ని ఇక రాజకీయం చేయవద్దని,సినిమా హీరోల ఇండ్ల పై దాడులు చేయకూడని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు..ఈ సందర్భంగా పుష్ప 2 నిర్మాత 50 లక్షల చెక్కును మృతి చెందిన రేవతి..ఆమె కుమారుడు శ్రీతేజ్ తండ్రి భాస్కర్ కు అందజేశారు.

Jr NTR: మాట తప్పిన ఎన్టీఆర్!

బాబు పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని దేవుడి దయవల్ల త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సినిమా ఇండస్ట్రీ ఎక్కడికీ వెళ్లడం లేదని అన్ని పుకార్లు ఎవరు నమ్మొద్దని మంత్రి స్పష్టం చేశారు..ఎవరి పైనా దాడులు చేసినా చట్టం ఊరుకోదని కఠిన చర్యలు తప్పవని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు.

Show comments