తమిళ్‌లో ఇటీవల విడుదలై సూపర్ హిట్ అయిన ‘డీఎన్ఏ’ మూవీ ఎలాంటి హిట్ అందుకుందో తెలిసిందే. నెల్సన్ వెంకటేసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇటీవలే విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. హాస్పిటల్స్‌లో పిల్లల్ని మాయం చెయ్యడం, వారిని వేరే చోట అమ్మేయడం వంటి వార్తలు చూస్తుంటాం. ఇలాంటి వార్తలు ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం. ఈ సినిమా మరొక్కసారి గా మనం సొసైటీలో ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియచేసింది. అధర్వ మురళి, నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్, భావోద్వేగ డ్రామాతో కూడిన గ్రిప్పింగ్ కథాంశంతో ఆకట్టుకుంది. అయితే తమిళంలో విజయం సాధించిన ‘DNA’ మూవీ ఇప్పుడు తెలుగులో మై బేబీ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : Saptami Gowda : పుష్పలో రష్మిక మాదిరి స్ట్రాంగ్ క్యారెక్టర్ కావాలి..
ప్రేమిస్తే, జర్నీ, షాపింగ్‌మాల్, పిజ్జా వంటి అనువాద హిట్స్‌ని తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత సురేశ్ కొండేటి, ఇప్పుడు ‘మై బేబీ’ సినిమాను ఎస్.కె. పిక్చర్స్ బ్యానర్‌పై రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా తెలుగు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 18, 2025న థియేటర్లలో విడుదల కానుంది. ఇక భావోద్వేగాలతో పాటు థ్రిల్ కలగలిపిన స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని మేకర్స్ చెబుతున్నారు. అందరి దృష్టిని ఆకర్షించిన తమిళ వర్షన్‌లాగే, తెలుగు ప్రేక్షకుల మనసులను కూడా మై బేబీ కట్టిపడేస్తుందో లేదో.. చూడాలి!
