Mutta Kalakki : తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా జివి ప్రకాష్.. రికార్డ్స్ బద్దలు కొట్టిన ‘ముట్ట కలక్కి’

Matti Kilikki

Matti Kilikki

జి.వి. ప్రకాష్ కుమార్ తన మ్యూజిక్ తో రికార్డులు బద్దలు కొడుతున్నాడు. తమిళంలో అత్యధిక వ్యూస్ రాబట్టిన సాంగ్స్ ఇప్పడు జీవి పేరుతో రికార్డులు నమోదయ్యాయి. తమిళ్ లో ఇటీవల వచ్చిన యూత్ సినిమా సూపర్ హిట్ అయింది. కెన్ కరుణాస్ నటించి డైరెక్షన్ చేసిన ఈ సినిమాలోని ‘ముట్ట కలక్కి’ పాట తమిళనాడులో ఒక ఊపు ఊపేస్తోంది. ఈ సాంగ్ అతి తక్కువ కాలంలోనే 158 మిలియన్ల వ్యూస్‌ను దాటేసి 2026 సంవత్సరానికి గాను తమిళంలో అత్యధిక వ్యూస్ సాధించిన నంబర్ 1 సాంగ్‌గా నిలిచింది. కెన్ కరుణాస్ పాడిన ఈ పాటలోని బీట్స్ మరియు ఎనర్జీ యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

గతేడాది ధనుష్ దర్శకత్వంలో వచ్చిన ‘NEEK’ (నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్) చిత్రంలోని గోల్డెన్ స్పారోపాట 2025 టాప్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు అదే జోరును ‘ముట్ట కలక్కి’ కొనసాగిస్తోంది. గతేడాది ‘గోల్డెన్ స్పారో’ ఎలాగైతే ట్రెండ్ సెట్ చేసింద ఈ ఏడాది జి.వి. ప్రకాష్ తన సొంత రికార్డులను తానే తిరగరాస్తూ ఈ మాస్ సాంగ్‌తో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం సొషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘ముట్ట కలక్కి’ వైబ్రేషన్స్ వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్స్ మరియు డ్యాన్స్ కవర్లతో ఈ సాంగ్ హల్ చల్ చేస్తోంది. ఒక మ్యూజిక్ డైరెక్టర్ గానే కాకుండా హీరోగా కూడా రాణిస్తున్న జి.వి. ప్రకాష్ ఇలాంటి చార్ట్‌బస్టర్ సాంగ్స్ ఇస్తూ తన హవాను కొనసాగిస్తున్నారు. కేవలం 2026 ప్రారంభంలోనే ఈ స్థాయి వ్యూస్ రావడం చూస్తుంటే ఈ ఏడాది ముగిసేలోపు ఈ పాట ఇంకెన్నీ మిలియన్స్ రాబడుతోందో జస్ట్ లిజన్ అండ్ వాచ్.