Site icon NTV Telugu

మెగాస్టార్ పై మురళీమోహన్ ఆసక్తికర కామెంట్స్

Muralimohan

Murali mohan

ప్రముఖ సీనియర్ నటుడు, మాజీ ఎంపి మురళీ మోహన్ మెగాస్టార్ చిరంజీవిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుత తెలుగు చిత్ర పరిశ్రమకు గాడ్ ఫాదర్ అని ఎన్టీవీ ఛానెల్ కి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాసరి నారాయణరావు జీవించి ఉన్నంత కాలం తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రధాన పాత్ర పోషించారు. అయితే ఇప్పుడు ఆయన స్థానంలో చిరంజీవి కొంతవరకు భర్తీ చేస్తున్నారని అన్నారు. అలాగే చిత్ర పరిశ్రమలో వ్యక్తుల మధ్య తలెత్తే ఏ సమస్యకైనా స్పందించడానికి మెగాస్టార్ చిరంజీవి చొరవ తీసుకుంటున్నారని మురళీ మోహన్ అన్నారు. కరోనా సంక్షోభ సమయంలో పేద సాంకేతిక నిపుణులు, జూనియర్ కళాకారులకు చిరు సహాయం చేసాడు. కరోనా బాధితులకు ఆక్సిజన్ సరఫరా చేశాడు. ప్రస్తుతం ఆయన తెలుగు చిత్ర పరిశ్రమకు గాడ్‌ఫాదర్ అని మురళి మోహన్ అన్నారు.

Read Also : కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్

ఇక ‘మా’ ఎలెక్షన్స్’ గురించి మాట్లాడుతూ… ‘మా’ అధ్యక్ష పదవి కోసం పెద్దలందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుని, అందరినీ ఒప్పించి యునానిమస్ ఎలక్షన్ నామినేటేడ్ బాడీని సెలెక్ట్ చేయాలని అన్నారు. దీనికి అందరూ ఒప్పుకుని తీరాలి. అంతేకాని ఒకరిపై ఒకరు ఇలా కామెంట్స్ చేసుకుంటూ ఉంటే అది కుక్కలు చింపిన విస్తరి అవుతుంది అని అన్నారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారో ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.

Exit mobile version