Site icon NTV Telugu

Mukul Dev : ప్రముఖ హిందీ నటుడు ఆకస్మిక మృతి ..

Hindi Actor, Mukul Dev,

Hindi Actor, Mukul Dev,

బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు ముకుల్ దేవ్(54) మరణించారు. ఆయన ఆకస్మిక మరణం బాలీవుడ్ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే, ముకుల్ దేవ్ మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. శుక్రవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఈ వార్త తెలిసిన వెంటనే స్నేహితులు శనివారం ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆయన సన్నిహితురాలు, నటి దీపశిఖా నాగ్‌పాల్ ఈ మరణవార్తకు సోషల్ మీడియా ద్వారా రియాక్ట్ అవుతూ.. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో, ముకుల్ దేవ్‌తో ఉన్న పాత చిత్రాన్ని పంచుకుంది.

Also Read : Nani : ‘హిట్ 3’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ముకుల్ దేవ్ ‘సన్ ఆఫ్ సర్దార్’, ‘ఆర్.. రాజ్‌కుమార్’, ‘జై హో’ వంటి సినిమాలతో మంచి హిట్ అందుకున్నాడు. అంతే కాదు తెలుగులో ‘కృష్ణ’, ‘ఏక్ నిరంజన్’, ‘కేడీ’, ‘అదుర్స్’ వంటి తదితర చిత్రాల్లో ఆయన నటించారు. నటుడు రాహుల్ దేవు ఈయన తమ్ముడు. అయితే తల్లిదండ్రుల మరణంతో ముకుల్ కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్నారు. ఈ క్రమంలో అనారోగ్యం పాలవ్వడంతో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం.

Exit mobile version