Site icon NTV Telugu

రెగ్యులర్ షూటింగ్‌లో ‘7 డేస్ 6 నైట్స్’

MS Raju's next 7 Days 6 Nights shoot begin

గత ఏడాది ‘డర్టీ హరి’ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు దర్శకుడుగా వచ్చారు ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు. ఆయన తాజాగా రూపొందిస్తున్న సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. వింటేజ్ పిక్చర్స్, ఏబిజి క్రియేషన్స్ ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములు. ఈ చిత్రానికి సుమంత్ అశ్విన్ ఎం, రజనీకాంత్ ఎస్ నిర్మాతలు. ఈ నెల 21 (సోమవారం) హైదరాబాద్ లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ సినిమాతో పదిహేనేళ్ల కుర్రాడు సమర్థ్ గొల్లపూడిని సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. పాటలు, నేపథ్య సంగీతం చాలా కొత్తగా, అల్ట్రామోడ్రన్‌గా ఉండాలనే ఉద్దేశంతో అతడిని తీసుకున్నారు. ప్రస్తుతం అగ్ర సంగీత దర్శకులలో ఒకరైన దేవిశ్రీ ప్రసాద్‌ను ఎంఎస్ రాజుగారు పరిచయం చేసిన సంగతి తెలిసిందే.

Read Also : పవర్ స్టార్ పేరు మార్చేసిన బండ్ల గణేష్

ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్ ఎం మాట్లాడుతూ “జూన్ 21న మొదలైన ఈ షెడ్యూల్ జూలై 10 వరకూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఆ తర్వాత 15 నుంచి గోవా, మంగుళూరు, ఉడిపి, అండమాన్ నికోబార్ దీవుల్లో నెలరోజుల పాటు ఏకధాటిగా చిత్రీకరణ జరపడానికి సన్నాహాలు చేశాం. సెప్టెంబర్ రెండోవారంలో చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తున్నాం. ‘డర్టీ హరి’ తర్వాత దర్శకుడిగా మరో భారీ విజయానికి నాన్నగారు శ్రీకారం చుట్టారు. సాంకేతిక పరంగానూ ఈ సినిమా ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కుతోంది” అని అన్నారు.

Read Also : కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్

ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ “ఇదొక కూల్ అండ్ న్యూఏజ్ ఎంటర్టైనర్. యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో సినిమా రూపొందిస్తున్నాం. ఇందులో నటీనటుల వివరాల్ని ప్రస్తుతానికి గోప్యంగా ఉంచాం. తర్వాత వాళ్లు ఎవరనేది వెల్లడిస్తాం. కథ పరంగా వివిధ ప్రాంతాల్లో చిత్రీకరణ చేయాలి. అందుకు తగ్గట్టు పక్కా ప్రణాళిక వేసుకుని, చిత్రీకరణ మొదలుపెట్టాం. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేస్తున్నాం. ‘డర్టీహరి’తో నా జీవితం కొత్త మలుపు తీసుకుంది. నిర్మాతగా, దర్శకుడిగా… నేనెప్పుడూ ఒకదానికి, మరొక దానికి పొంతన లేకుండా సినిమాలు చేస్తూ వచ్చాను. ‘డర్టీ హరి’ ఓ జానర్ సినిమా.‌ ‘7 డేస్ 6 నైట్స్’ కూల్ ఎంటర్టైనర్. ఇందులో వినోదానికి మంచి అవకాశం ఉంది. లవ్, ఎమోషన్స్ ‌కి చక్కటి ఆస్కారం ఉంది. సంగీతానికి సినిమాలో చాలా ప్రాముఖ్యం ఉంది. పాటలు కొత్తగా ఉంటాయి” అని అన్నారు.

Exit mobile version