రెగ్యులర్ షూటింగ్‌లో ‘7 డేస్ 6 నైట్స్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ఏడాది ‘డర్టీ హరి’ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు దర్శకుడుగా వచ్చారు ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు. ఆయన తాజాగా రూపొందిస్తున్న సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. వింటేజ్ పిక్చర్స్, ఏబిజి క్రియేషన్స్ ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములు. ఈ చిత్రానికి సుమంత్ అశ్విన్ ఎం, రజనీకాంత్ ఎస్ నిర్మాతలు. ఈ నెల 21 (సోమవారం) హైదరాబాద్ లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ సినిమాతో పదిహేనేళ్ల కుర్రాడు సమర్థ్ గొల్లపూడిని సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. పాటలు, నేపథ్య సంగీతం చాలా కొత్తగా, అల్ట్రామోడ్రన్‌గా ఉండాలనే ఉద్దేశంతో అతడిని తీసుకున్నారు. ప్రస్తుతం అగ్ర సంగీత దర్శకులలో ఒకరైన దేవిశ్రీ ప్రసాద్‌ను ఎంఎస్ రాజుగారు పరిచయం చేసిన సంగతి తెలిసిందే.
Read Also : పవర్ స్టార్ పేరు మార్చేసిన బండ్ల గణేష్
Also Read
ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్ ఎం మాట్లాడుతూ “జూన్ 21న మొదలైన ఈ షెడ్యూల్ జూలై 10 వరకూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఆ తర్వాత 15 నుంచి గోవా, మంగుళూరు, ఉడిపి, అండమాన్ నికోబార్ దీవుల్లో నెలరోజుల పాటు ఏకధాటిగా చిత్రీకరణ జరపడానికి సన్నాహాలు చేశాం. సెప్టెంబర్ రెండోవారంలో చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తున్నాం. ‘డర్టీ హరి’ తర్వాత దర్శకుడిగా మరో భారీ విజయానికి నాన్నగారు శ్రీకారం చుట్టారు. సాంకేతిక పరంగానూ ఈ సినిమా ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కుతోంది” అని అన్నారు.
Read Also : కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్
ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ “ఇదొక కూల్ అండ్ న్యూఏజ్ ఎంటర్టైనర్. యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో సినిమా రూపొందిస్తున్నాం. ఇందులో నటీనటుల వివరాల్ని ప్రస్తుతానికి గోప్యంగా ఉంచాం. తర్వాత వాళ్లు ఎవరనేది వెల్లడిస్తాం. కథ పరంగా వివిధ ప్రాంతాల్లో చిత్రీకరణ చేయాలి. అందుకు తగ్గట్టు పక్కా ప్రణాళిక వేసుకుని, చిత్రీకరణ మొదలుపెట్టాం. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేస్తున్నాం. ‘డర్టీహరి’తో నా జీవితం కొత్త మలుపు తీసుకుంది. నిర్మాతగా, దర్శకుడిగా… నేనెప్పుడూ ఒకదానికి, మరొక దానికి పొంతన లేకుండా సినిమాలు చేస్తూ వచ్చాను. ‘డర్టీ హరి’ ఓ జానర్ సినిమా. ‘7 డేస్ 6 నైట్స్’ కూల్ ఎంటర్టైనర్. ఇందులో వినోదానికి మంచి అవకాశం ఉంది. లవ్, ఎమోషన్స్ కి చక్కటి ఆస్కారం ఉంది. సంగీతానికి సినిమాలో చాలా ప్రాముఖ్యం ఉంది. పాటలు కొత్తగా ఉంటాయి” అని అన్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!