‘7 డేస్ 6 నైట్స్’లో సుమంత్ అశ్విన్ కూడా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘డర్టీ హరి’ మూవీ తర్వాత ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. ఈ చిత్రాన్ని సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ సమర్పణలో, వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ పతాకం మీద సుమంత్ అశ్విన్, రజనీకాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమా ప్రారంభంలో కేవలం నిర్మాతగానే సమంత్ అశ్విన్ పేరు కనిపించగా, ఇప్పుడు అతను కూడా ఇందులో హీరోగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. సుమంత్ అశ్విన్ సరసన మెహర్ చావల్ అనే కొత్తమ్మాయిని పరిచయం చేస్తున్నారు. వీరిద్దరితో పాటు రోహన్, కృతికా శెట్టి మరో జంటగా పరిచయమవుతున్నారు. ఈ నలుగురే కాకుండా సుష్మ, రిషికా బాలి ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’తో చక్కని నటన కనబరిచిన గోపరాజు రమణ అతిథిపాత్రలో కనిపించబోతున్నారు. గురువారం ఈ సినిమాకు సంబంధించిన విడుదల చేసిన పోస్టర్ తో సుమంత్ అశ్విన్ సైతం ఇందులో నటిస్తున్న విషయం బోధపడింది. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ, ‘జూన్ 21న హైదరాబాద్ లో తొలి షెడ్యూల్ ప్రారంభించి 22 రోజులు చిత్రీకరణ జరిపామని, ఈ నెల 28 నుండి 20 రోజుల పాటు బెంగళూర్, ఉడిపి, గోకర్ణ, గోవాల్లో మలి షెడ్యూల్ జరుపుతామ’ని అన్నారు.
Read also : చిక్కుల్లో పడ్డ ప్రియమణి… పెళ్ళి వివాదం!
Also Read
దర్శకుడు ఎం. ఎస్. రాజు మాట్లాడుతూ “సాధారణంగా ‘డర్టీ హరి’ లాంటి హిట్ చిత్రం తర్వాత మళ్లీ అదే తరహా సినిమా చేస్తారని అందరూ ఊహిస్తారు. కానీ, ‘7 డేస్ 6 నైట్స్’ అందుకు భిన్నంగా వేరే రీతిలో ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంటిల్లిపాదినీ వినోదపరిచే విధంగా చక్కటి జాలీ ట్రిప్‌లా మూవీ ఉండబోతోంది. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, విజువల్స్, మ్యూజిక్ ఈ చిత్రాన్ని డామినేట్ చేస్తాయి. సినిమాలో పాత్రలు హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు? అన్నట్టు కాకుండా మన కళ్ల ముందు కదలాడే సజీవ పాత్రల్లా ఉంటాయి. అందరూ ఆ పాత్రలకు న్యాయం చేస్తున్నారు. ఇప్పటికి 60 శాతం సినిమా పూర్తయింది” అని అన్నారు. ఈ సినిమాతో సమర్థ్ గొల్లపూడి సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
తాజావార్తలు
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!