NTV Telugu Site icon

MrBachchan: మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లేస్ ఫిక్స్.. రవితేజ కోసం పవన్ కళ్యాణ్..?

Untitled Design 2024 08 11t101625.063

Untitled Design 2024 08 11t101625.063

మాస్ మహారాజ రవితేజ హీరోగా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తోన్న మాస్ యాక్షన్ చిత్రం మిస్టర్ బచ్చన్. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ నటించిన ‘రైడ్’ అఫీషియల్ రీమేక్ ఈ మిస్టర్ బచ్చన్. సేమ్ టు సేమ్ కాకుండా మూల కథను తీసుకుని మిగిలిన కథను రవితేజకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశామని దర్శకుడు ఇటీవల పలు ఇంటర్వూలలో తెలిపాడు. ఆగస్టు 15న రిలిజ్ కానున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై TG. విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు.

Also Read: Pushpa The Rule: గంగమ్మ జాతర ఎపిసోడ్.. నీ యవ్వ.. తగ్గేదే లా..

రిలీజ్ కు మరి కొద్ది రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది యూనిట్. ఇటీవల ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. తాజగా మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఫిక్స్ చేశారు నిర్మాతలు. ఆంధ్రప్రదేశ్, రాయలసీమలోని కర్నూల్ లో ఈ వేడుకను నిర్వహించనున్నారు మేకర్స్. ఈ ఆగస్టు 12న STBC కాలేజి  గ్రౌండ్స్ లో సాయంత్రం 6:00 గంటలకు భారీ స్థాయిలో ప్లాన్ చేశారు మేకర్స్. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు పీపుల్స్ మీడియా నిర్మాతలు. వీలును బట్టి చూసుకుని కుదిరితే వస్తానని పవన్ చెప్పినట్టు సమాచారం. అదే విధంగా కర్నూలు తెలుగుదేశం ఎమ్మెల్యే &  పరిశ్రమల శాఖ మంత్రి  TG. భరత్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ వేడుకలో మాస్ మహా రాజ రవితేజ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్స్, జగపతిబాబు, దర్శకుడు హరీష్ శంకర్ తో పాటు యూనిట్ సందడి చేయనుంది.

Show comments