Mr. Deyyam : హారర్ కామెడీకి సరికొత్త నిర్వచనంలా ‘మిస్టర్ దెయ్యం’ ఫస్ట్ లుక్!

Mr Deyyyam

Mr Deyyyam

టాలీవుడ్‌లో హారర్ కామెడీ చిత్రాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఆ జానర్‌లో ప్రేక్షకులను భయపెడుతూనే, పొట్టచెక్కలయ్యేలా నవ్వించేందుకు ముస్తాబవుతున్న సరికొత్త సినిమా ‘మిస్టర్ దెయ్యం’. విజయ్ శంకర్, సిరి చౌదరి, ఖయ్యూమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంజన అన్నే దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మంచు మనోజ్, అలీ, వీఎన్ ఆదిత్య, ఆర్పీ పట్నాయక్ వంటి సినీ ప్రముఖుల చేతుల మీదుగా ఘనంగా లాంచ్ అయిన ఈ సినిమా, తన ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
ఎవరో తెలియని ఓ అస్తిపంజరం అచ్చం రాజకుమారుడిలా, మగపెళ్లికూతురి గెటప్‌లో ముస్తాబై సింహాసనం మీద దర్జాగా కూర్చుని ఉన్న ఈ పోస్టర్ చూస్తుంటే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. పచ్చని పూల దండలు, కళ్లకు నల్ల అద్దాలు, రాజసాన్ని ఉట్టిపడేలా చేతిలో వాకింగ్ స్టిక్ పట్టుకున్న ఆ దెయ్యం, పూర్తి చంద్రుడు వెలుతురులో ఓ పురాతన ఆలయం ముందు కూర్చుని ఉన్న ఈ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. చుట్టూ పుర్రెలు, ఎర్రటి కళ్ళతో ఉన్న దెయ్యాలు, రక్తంతో తడిసిన టైటిల్ డిజైన్.. ఈ సినిమా పక్కా హారర్ కామెడీ అని చెప్పకనే చెబుతున్నాయి.
ఈ సందర్భంగా హీరో విజయ్ శంకర్ మాట్లాడుతూ.. ‘మిస్టర్ దెయ్యం’ ఒక ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తుందని, ఇంతవరకు తెలుగు ప్రేక్షకులు చూడని సరికొత్త హారర్ ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయని చెప్పారు. సంజన అన్నే ఈ చిత్రాన్ని అద్భుతమైన విజువల్స్, నవ్విస్తూనే భయపెట్టే కథనంతో తెరకెక్కిస్తున్నట్లు నటుడు పింగ్ పాంగ్ సూర్య తెలిపారు.
అన్నే క్రియేషన్స్ బ్యానర్‌పై శౌర్య ఆర్య సమర్పణలో వెంకట్ నిమ్మలపూడి, సింధు అన్నే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాబు కె. రావు సినిమాటోగ్రఫీ, రాజేష్ సంగీతం ఈ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చనున్నాయి. నవంబర్ మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనున్న ‘మిస్టర్ దెయ్యం’, తన ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే టాలీవుడ్‌లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది.