Site icon NTV Telugu

ట్రోల్ వీడియోలు.. ‘మా’ మరో వార్నింగ్.. ఈసారి 18 యూట్యూబ్ ఛానల్స్ ఊస్టింగ్!

Maa Manchu Vishnu

Maa Manchu Vishnu

Movie Artist Association Terminates 18 More Youtube Channels: మూవీ ఆర్టిస్టుల మీద సోషల్ మీడియా ట్రోలింగ్ విషయంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్న సంఘటన తెలిసిందే. అందులో భాగంగానే ఈ మధ్యనే ఐదు యూట్యూబ్ ఛానల్స్ మీద సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ద్వారా చర్యలు తీసుకున్నారు. ఐదు చానల్స్ ని పూర్తిగా తొలగించారు. ఇక ఇప్పుడు మరొక 18 చానల్స్ ని తొలగిస్తూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 18 యూట్యూబ్ ఛానల్స్ ని తొలగించినట్లుగా వాటి పేర్లు, యూట్యూబ్ ఛానల్ యుఆర్ఎల్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Sundeep Kishan: నెలకు నాలుగున్నర లక్షల ఫుడ్ ఫ్రీగా పంచుతున్నా

సినిమా ఆర్టిస్టుల మీద, వాళ్ళు వ్యక్తిగత జీవితాలను ఇబ్బంది పెట్టే విధంగా ఉన్న కంటెంట్ని తాము తొలగిస్తున్నామని అందులో భాగంగానే మరొక 18 చానల్స్ ఏవైతే ఇబ్బందికర అంశాలను ప్రమోట్ చేస్తున్నాయో వాటిని తొలగించామని వెల్లడించింది. ఇక ఈ మేరకు 18 చానల్స్ లిస్ట్ కూడా షేర్ చేసింది. అంతేకాక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున యూట్యూబర్లను, సోషల్ మీడియా ట్రోలర్లను ఒకటే కోరుతున్నామని చెప్పుకొచ్చింది. అదేమంటే ఇబ్బందికరంగా ఉన్న ట్రోల్ వీడియోస్ మీద ఒక రిపోర్ట్ తయారు చేసి సైబర్ క్రైమ్ ఆఫీస్ కి అందచేయబోతున్నామని, భవిష్యత్తులో మీకు ఇబ్బంది ఉండకూడదు అనుకుంటే మీ ఛానల్ లో ఉన్న కించపరిచే విధంగా ఉన్న వీడియోలను తొలగించాల్సిందిగా హెచ్చరించింది. లేదంటే కచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంది.

Exit mobile version