Money Heist: ‘మనీ హెయిస్ట్’ ఫ్యాన్స్‌కు నెట్‌ఫ్లిక్స్ సర్ప్రైజ్.. ప్రొఫెసర్ ప్రయాణం ఇంకా ముగియలేదు!

Money Heist

Money Heist

Money Heist: స్పానిష్ వెబ్ సిరీస్ ‘ల కాసా డీ పాపెల్’ .. ఇంగ్లీష్ లో ‘మనీ హెయిస్ట్’ పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో మన అందరికీ తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రసారమైన ఈ గ్లోబల్ హిట్ సిరీస్ మొత్తం 5 సీజన్లతో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వరల్డ్ ఆఫ్ మనీ హెయిస్ట్ ఇంకా ముగియలేదంటూ నెట్‌ఫ్లిక్స్ తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది.

ప్రొఫెసర్ ఈజ్ బ్యాక్..
నెట్‌ఫ్లిక్స్ ఇటీవల విడుదల చేసిన ప్రోమోతో అభిమానుల్లో మళ్లీ కొత్త ఊపు వచ్చింది. ‘వరల్డ్ ఆఫ్ మనీ హెయిస్ట్’ పేరుతో ఈ సిరీస్‌ను మళ్లీ సరికొత్త కథలతో ముందుకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు స్టార్ట్ అయ్యాయి. దీంతో ప్రొఫెసర్ అభిమానులు ఓ రేంజ్ లో ఎగ్జైట్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ సిరీస్ పనులు ప్రారంభమయ్యాయని, త్వరలోనే అధికారికంగా స్ట్రీమింగ్‌కు రానుందని సమాచారం. ఇదిలా ఉండగా మనీ హెయిస్ట్‌కు లింక్ ఉన్న మరో క్రేజీ స్పిన్ – ఆఫ్ సిరీస్ ‘బెర్లిన్’ గురించి కూడా బిగ్ అప్‌డేట్ వచ్చింది. బెర్లిన్ మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో, సీజన్-2 స్ట్రీమింగ్‌కు రెడీ అవుతుంది. బెర్లిన్ సీజన్-2 మే 15న నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతోంది. మనీ హెయిస్ట్ కథ స్టార్ట్ కాకముందు బెర్లిన్ టీమ్ చేసిన దోపిడీల నేపథ్యంలో ఈ సిరీస్ సాగనుంది. మొత్తానికి మనీ హెయిస్ట్ ప్రేమికులకు ఈ వేసవిలో నెట్‌ఫ్లిక్స్ అదిరిపోయే వినోదాన్ని పంచడానికి సిద్ధమైపోయింది.