Peddi Monday Test : ఈ రోజు నుండి ‘పెద్ది’కి అసలైన ఆట మొదలు

Ram Charan

Ram Charan

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో వచ్చిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద తొలిరోజే రూ. 135 కోట్ల కలెక్షన్లు రాబట్టి రికార్డుల సునామీ సృష్టిస్తోంది. భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం తొలి మూడు రోజుల్లోనే ఏకంగా రూ. 236.7 కోట్ల భారీ గ్రాస్ వసూలు చేసి బిగ్గెస్ట్ ఓపెనింగ్‌ను తన ఖాతాలో వేసుకుంది. లాంగ్ వీకెండ్ పూర్తిగా కలిసి రావడంతో అన్ని చోట్లా థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడాయి. వీకెండ్ మొత్తం ‘పెద్ది’ తన సత్తా చాటాడు.

ఇక నిన్నటితో లాంగ్ వీకెండ్ ముగియడంతో ‘పెద్ది’కి అసలు ఆట నేటి నుంచే మొదలు కానుంది. ఈ రోజు సోమవారం వర్కింగ్ డే కావడంతో బాక్సాఫీస్ వద్ద సినిమా నిలకడగా రాణిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం అనేది ఈ సోమవారం నుంచి వచ్చే వసూళ్లపైనే ఆధారపడి ఉంది. సినిమాను   కొనుగోలు చేసిన బయ్యర్లకు లాభాలు రావాలంటే నేటి నుంచి కూడా కలెక్షన్ల పరంగా డీసెంట్ హోల్డ్  సాధించి లాంగ్ రన్ మంచి పర్ఫామ్ చేయడం అత్యంత కీలకం. అయితే పోటీలో మరేఇతర సినిమాలు లేకపోవడం సినిమా చూడాలంటే పెద్ది ఒకటే ఆప్షన్ కావడం కాస్త కలిసొచ్చే అంశం. మౌత్ టాక్ బాగుండడంతో ఈ రోజు కూడా డీసెంట్ హోల్డ్ చేస్తుందని ట్రేడ్ అంచనా వేస్తుంది. నైజాంలో దూకుడుచుపిస్తున్న పెద్ది ఆంధ్రలో వర్షాల కారణంగా కొన్ని ఏరియాలలో శని, ఆదివారం కాస్త స్లో అయింది. ఇక ఈ రోజు నుండి ఎలా హోల్డ్ చేస్తుందో లెట్స్ వెయిట్ అండ్ వాచ్.

×
×
Ad