Mokshagna Teja PVCU movie announcement tomorrow: నందమూరి అభిమానులందరూ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చేస్తోంది. నిజానికి చాలా కాలంగా నందమూరి అభిమానులందరూ మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. సుమారు 7, 8 ఏళ్ల క్రితమే మోక్షజ్ఞ పుట్టినరోజు వేడుకలు జరపడం మొదలు పెట్టారు. అప్పటినుంచి ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తాడు ఇస్తాడు అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వారి ఎదురుచూపులు ఫలించి రేపు మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన చేయబోతున్నారు. హనుమాన్ తో ప్రపంచం మొత్తం సాలిడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో నందమూరి మోక్షజ్ఞ మొదటి సినిమా ఉండబోతోంది. మైథాలజీ టచ్ ఉన్న ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ కూడా ఒక కీలకపాత్రలో నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
Thalapathy Vijay: రాసిపెట్టుకోండి.. విజయ్ తమిళనాడు సీఎం అవుతారు! ప్రేమ్‌గీ జోస్యం
అది కృష్ణుడి పాత్ర అనే ప్రచారం కూడా ఉంది కానీ క్లారిటీ రావాల్సి ఉంది. రేపు మాత్రం పుట్టినరోజు సందర్భంగా సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించి అధికారిక ప్రకటన చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మించబోతున్నట్లుగా తెలుస్తోంది. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ సినిమాకి బాలయ్య రెండో కూతురు తేజస్విని సహనిర్మాతగా వ్యవహరించబోతున్నారు. ఇప్పటికే నందమూరి ఫ్యామిలీకి పలు నిర్మాణ సంస్థలు ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ కూడా ఎన్బికె ఆర్ట్స్ పేరుతో ఒక నిర్మాణ సంస్థ ప్రారంభించి పలు సినిమాలు చేశారు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ రెండవ కుమార్తె సొంతంగా ఒక బ్యానర్ ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆమె గీతం సంస్థల అధినేత, మూర్తి వారసుడు భరత్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. భరత్ ప్రస్తుతానికి విశాఖపట్నం నుంచి టిడిపి ఎంపీగా ఉన్నారు.