మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కి చెందిన వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన చిత్రం ‘కొత్త లోక చాఫ్టర్ట్ 1’. ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు. సూపర్ హీరోయిన్ చంద్రగా కళ్యాణి ప్రియదర్శన్ నటించిన ఈ సినిమా ‘కొత్త లోక’ సినిమాటిక్ యూనివర్స్ లోని ఫస్ట్ పార్ట్ గా తెరకెక్కింది. భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రంగా వచ్చిన ‘కొత్త లోక చాఫ్టర్ 1’ తోలి రోజు నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
ఓనం కానుకగా రిలీజ్ అయిన కొత్త లోక అదరగొడుతుంది రిలీజ్ అయిన తోలి మూడు రోజులకు గాను రూ. 42 కోట్ల గ్రాస్ రాబట్టింది లోక. ఓనం కానుకాగా పోటీగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన హృదయపూర్వంను ఉన్న కూడా ఆ సినిమాను వెనక్కు నెట్టి కొత్త లోక భారీ వసూళ్లు రాబట్టి సెన్సషన్ క్రియేట్ చేస్తుంది. కాగా ఇప్పుడు కొత్త లోక సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. మలయాళ ఆల్ టైమ్ రికార్డ్ వసూళ్లు రాబట్టిన సినిమాల ఫస్ట్ ప్లేస్ లో మోహన్ లాల్ నటించిన ఎంపురాన్ ఉంది. సెకండ్ ప్లేస్ లో మోహన్ లాల్ మరోక సినిమా తుడారం నిలవగా 18రోజులకు గాను రూ. 83.19 కోట్లు కొల్లగొట్టి కేరళలో రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా లోక నిలిచింది. ఇక కేరళలో షేర్ పరంగా రూ. 37కోట్లు రాబట్టింది. ఈ సినిమా రూ. 30 కోట్లు అంటే పెట్టిన పెట్టుబడి మొత్తం కేరళలోనే రాబట్టి భారీ లాభాలు చూసింది లోక.
