మలయాళ స్టార్ సురేష్ గోపి ఈ రోజు (జూన్ 26)న తన 63వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సురేష్ గోపి 251వ చిత్రం పోస్టర్‌ను ట్విట్టర్ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ రిలీజ్ చేశారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం “ఎస్జీ 251” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి రాహుల్ రామచంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. పోస్టర్‌తో పాటు సురేష్ గోపికి మోహన్ లాల్ పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలిపారు.
Read Also : కొండల్లో అందాల రాక్షసి కేఫ్…!?
“పుట్టినరోజు సందర్భంగా నా ప్రియమైన స్నేహితుడు సురేష్ గోపి ‘SG251’ క్యారెక్టర్-రివీల్ పోస్టర్‌ను విడుదల చేస్తున్నాము. సురేష్ మీకు శుభాకాంక్షలు! పుట్టినరోజు శుభాకాంక్షలు ముందుగానే పంపుతున్నాను” అంటూ ట్వీట్ చేశారు మోహన్ లాల్. ఈ పోస్టర్ లో సురేష్ గోపి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపిస్తున్నాడు. అతను తన డెస్క్ మీద స్లీప్వేర్ ధరించి, ఒక గడియారాన్ని మరమ్మత్తు చేస్తుండడాన్ని మనం గమనించొచ్చు. అంతేకాదు ఆయన చేతిలో భూతద్దం, తన పెంపుడు కుక్క కూడా ఉంది. ఈ చిత్ర కథను సమీన్ సలీమ్ రాశారు. ఎథెరియల్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఆగస్టు సినిమాస్ పంపిణీని నిర్వహిస్తుంది. పేరులేని ఈ చిత్రం తారాగణం, సిబ్బంది వివరాలను త్వరలో ప్రకటిస్తారు.
