Site icon NTV Telugu

Mohanlal : ‘తుడరుమ్’ తెలుగు ట్రైలర్ రిలీజ్..

Mohanlal,‘thudarum’,

Mohanlal,‘thudarum’,

ప్రస్తుతం ‘L2: ఎంపురాన్’ సక్సెస్ జోష్‌లో ఉన్న మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్.. అదే స్పీడ్ తో ‘తుడరుమ్’ అనే ఫామిలి మూవీతో రాబోతున్నాడు. ఈ సినిమాకు తరుణ్ మూర్తి దర్శకత్వం వహించగా.. మోహన్ లాల్ సరసన సీనియర్ నటి శోభన నటిస్తున్నారు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన మూవీలో మోహన్ లాల్ ఓ సాధారణ భర్తగా, ట్యాక్సీ డ్రైవర్‌గా కనిపించనున్నారు.. రెజపుత్ర విజువల్ మీడియా బ్యానర్‌పై ఎం.రెంజిత్ నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

Also Read: Peddi : ‘పెద్ది’ మూవీపై బుచ్చిబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ట్రైలర్ స్టార్‌టింగ్‌లో ఫ్యామిలి మ్యాన్ గా కనిపిచిన మోహన్ లాల్ ఎండ్ లో ‘ఇక నేను చెప్పింది మీరు వినాలి’ అంటూ వైలెంట్‌గా కనిపంచాడు. మొత్తానికి ఎక్కడ కూడా స్టోరీ లీక్ అవ్వకుండా.. ట్రైలర్ బాగా కట్ చేశారు. ఇక పోతే ఈ సినిమా రిలీజ్‌పై పలు రూమర్లు హల్చల్ చేయగా. మే వరకు విడుదల కాదంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు కామెంట్స్ చేశారు. వీటన్నింటికీ చెక్ పెడుతూ మోహన్ లాల్ రీసెంట్‌గా ఈ నెల 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.. ‘మీరంతా ఎన్నో రోజుల నుంచి ‘తుడరుమ్’ విడుదల విషయంలో రూమర్స్ వింటున్నారు. అవేవీ నిజం కాదు. ఈ సినిమా విడుదల టైం వచ్చేసింది. ఏప్రిల్ 25న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది’ అని పేర్కొన్నారు.

 

Exit mobile version