Drishyam 3 OTT Partner: ‘దృశ్యం 3’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. భారీ ధరకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drishyam 3 OTT Partner: భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే అత్యంత విజయవంతమైన సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంచైజీగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘దృశ్యం’ మూడో భాగంపై అటు సినీ వర్గాల్లో, ఇటు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. థియేట్రికల్ రిలీజ్‌కు ముందే ఈ సినిమా హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే ‘దృశ్యం 3’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ వైరల్‌గా మారింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబావూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి.. అన్ని డిజిటల్ ఫార్మాట్ల (SVOD, TVOD) ఎక్స్‌క్లూజివ్ రైట్స్ తమకే ఉన్నాయని అమెజాన్ ప్రైమ్ అధికారికంగా స్పష్టం చేసింది.
ఈ ఫ్రాంచైజీకి ఉన్న విపరీతమైన క్రేజ్ దృష్ట్యా ఫ్యాన్ బేస్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్రైమ్ వీడియో భారీ ఫ్యాన్సీ రేటును ఆఫర్ చేసి ఈ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇప్పటికే ‘దృశ్యం 1’, ‘దృశ్యం 2’ భాగాలు అమెజాన్ ప్రైమ్‌లోనే అందుబాటులో ఉండటం, వాటికి మిలియన్ల కొద్దీ వ్యూస్ రావడంతో.. మూడో భాగాన్ని కూడా తమ ప్లాట్ఫామ్లోనే ఉంచేలా మేకర్స్‌తో అమెజాన్ ముందే ఒప్పందం కుదుర్చుకుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో రికానున్న ఈ చిత్రం.. థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న తర్వాతే ఓటీటీలోకి రాబోతుంది. సాధారణంగా ఉండే 30 నుంచి 35 రోజుల విండో పీరియడ్‌ను మేకర్స్ ఫాలో అయ్యే అవకాశం ఉంది. జీతు జోసెఫ్ మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో, మోహన్‌లాల్ తన మార్క్ ‘జార్జ్‌కుట్టి’ పాత్రలో నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ముగింపు ఎలా ఉండబోతుందో చూడాలని థియేటర్ ఆడియన్స్‌తో పాటు ఓటీటీ లవర్స్ కూడా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
Also Read
- January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
- AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. 'AA 23'పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
తాజావార్తలు
-
India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
-
CM Revanth Reddy : దేశంలో మరో స్వతంత్ర పోరాటం తప్పదు
-
Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
-
Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
-
Coolpad Wide-Screen: రూ.13 వేలకే Coolpad వైడ్‌స్క్రీన్ ఫోన్? 16:10 డిస్ప్లే, Helio G99 చిప్సెట్తో రానుందా?
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!