Site icon NTV Telugu

Mohan Babu: పరారీలో లేను.. మోహన్ బాబు కీలక ప్రకటన

Mohan Babu News

Mohan Babu News

హత్యాయత్నం కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో పోలీసులు మోహన్ బాబు స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే నిన్నటి నుంచి మోహన్ బాబు పోలీసులకు అందుబాటులో లేరని కాబట్టి ఆయన పరారీలో ఉన్నారని ఒకసారి లేదు అజ్ఞాతంలోకి వెళ్లారని మరోసారి వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో మోహన్ బాబు తాజాగా తన సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. తన గురించి తప్పుడు వార్తలు ప్రచారం జరుగుతున్నాయని ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మెరుగైన ట్రీట్మెంట్ కోసం వైద్యం పొందుతున్నట్లు పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది.

Mohan Babu : పోలీసులకు అందుబాటులోకి మోహన్ బాబు.. విచారణ షురూ!

తాను వచ్చి వెపన్ డిపాజిట్ చేస్తానని పోలీసులకు సమాచారం ఇచ్చారు మోహన్ బాబు. అంతేకాక దర్యాప్తుకు సహకరిస్తానని కూడా పోలీసులకు మోహన్ బాబు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది..అజ్ఞాతంలో మంచు మోహన్‌బాబు ఉన్నట్టుగా ముందు వార్తలు వచ్చాయి. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో మోహన్‌బాబు స్టేట్‌మెంట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు.. నిన్నటి నుంచి పోలీసులకు అందుబాటులో లేకుండా మోహన్‌బాబు వెళ్లిపోయిన నేపథ్యంలో రంగంలోకి ఐదు బృందాలు దిగినట్టు వార్తలు వచ్చాయి.

Exit mobile version