గత రెండు రోజులుగా మోహన్ బాబు కేంద్రంగా జరుగుతున్న వివాదం నేపథ్యంలో మోహన్ బాబు స్వయంగా ఒక ఆడియో రిలీజ్ చేయడం సంచలనం రేపుతోంది.. తాజా ఘటనలపై మోహన్ బాబు రిలీజ్ చేసిన ఆడియోలో మనోజ్ నిన్ను నేను అల్లారుముద్దుగా పెంచాను. నీ చదువు కోసం కూడా చాలా ఖర్చు పెట్టాను, కానీ నువ్వు భార్య మాటలు విని నా గుండెల మీద తన్నావు. అంటూ మోహన్ బాబు మాట్లాడుతున్న ఆడియో ఇప్పుడు బయటికి రిలీజ్ అయింది. సుమారు 11 నిమిషాల నిడివి ఉన్న ఈ ఆడియోలో అనేక అంశాలను మోహన్ బాబు ప్రస్తావించారు.
Mohan babu: మోహన్‌బాబు సమక్షంలో మీడియా ప్రతినిధులపై బౌన్సర్ల దాడి
మనోజ్ నువ్వు నా బిడ్డ వి.. నిన్ను ఎలా పెంచాను రా నేను అందరికంటే నిన్నే గారాబంగా పెంచాను. నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నం చేశాను. నువ్వు ఏది అడిగినా అది నేను తెచ్చి ఇచ్చాను కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డలు గుండెల మీద తంతారు అంటారే అలా తన్నావురా. మనసు ఆవేదనతో కృంగిపోతోంది రా నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నాము. రా జర్నలిజం లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు రాస్తున్నారు రా నువ్వు నన్ను కొట్టడం ఏమిటిరా? నా బిడ్డ నన్ను తాకలా, ఇద్దరం ఘర్షణ పడ్డాము కొన్ని కారణాల వల్ల. ప్రతి ఫ్యామిలీ లోనూ ఉంటాయి రా ఇవి అంటూ మోహన్ బాబు ఎమోషనల్ అయ్యారు.