Mohan Babu Responds to Revanth Reddy Call on Anti Drug Campaign: హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో టీజీ న్యాబ్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాహనాలను సీఎం ప్రారంభించారు. అనంతరం నార్కోటిక్ బ్యూరో ఫోటో ఎగ్జిబిషన్ ను వీక్షించారు. టిక్కెట్ల రేట్లు పెంచాలన్నా, ఈ క్రమంలో షూటింగ్‌లు చేయాలన్నా, టికెట్ రేట్లు పెంచాలన్నా సినిమా పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి ముందస్తు షరతు విధించారు. నటీనటులు డ్రగ్స్ దుర్వినియోగం, సైబర్ క్రైమ్‌పై వీడియోలు చేయించి విడుదల చేయాలని కోరారు. సినిమా ప్రారంభం కావడానికి ముందు, డ్రగ్స్ దుర్వినియోగం, సైబర్ క్రైమ్‌పై రెండు వీడియోలను థియేటర్లలో ప్రదర్శించాలని కూడా అయన సూచించారు. డ్రగ్స్ మహమ్మారిపై అవగాహన కార్యక్రమంలో భాగస్వామి అయిన మెగాస్టార్ చిరంజీవిని అభినందిస్తున్నానని పేర్కొన్న ఆయన ప్రతీ సినిమా థియేటర్ లో సినిమాకు ముందు డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్ కు సంబంధించి వీడియోలు ఉచితంగా ప్రదర్శించేలా చూడాలన్నారు.
Pani puri: ‘పానీ పూరి’ శాంపిళ్లలో క్యాన్సర్ ఏజెంట్స్.. ప్రభుత్వం చర్యలు..
ఈ నిబంధనలకు సహకరించిన వారికి అనుమతి విషయంలో ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. ఈ క్రమంలో నటుడు మోహన్ బాబు స్పందించారు. అందరికీ నమస్కారం… ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ డ్రగ్స్ మహమ్మారికి యువత బలి అవుతున్న విషయం గురించి మాట్లాడుతూ, చలనచిత్ర నటీనటులను 1, 2 నిమిషాల నిడివిలో వీడియో చేసి, ప్రభుత్వానికి పంపమన్నారు. ఇంతకుముందే ఇటువంటి వీడియోలు నేను కొన్ని చేసి వున్నాను. అయినా ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు నేను సందేశాత్మకమైన కొన్ని వీడియోలు చేసి ఉడతా భక్తిగా సమాజానికి సేవ చేసుకుంటానని తెలియజేస్తున్నాను అంటూ పేర్కొన్నారు.