దక్షిణ భారత చిత్రసీమలో స్నేహానికి నిలువెత్తు నిదర్శనంగా సూపర్‌స్టార్ రజనీకాంత్, కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు మధ్య , స్నేహ బంధం ఇప్పటికీ కొనసాగుతోంది. అది కూడా ఈ ఇద్దరు 50 ఏళ్లుగా ఈ గాఢమైన అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవల మోహన్‌బాబు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. జీవితంలో ఇద్దరు ఎదురుకున్న కష్టాలను కూడా ఆయన పంచుకున్నారు.
Also Read : Ustaad Bhagat Singh: పవన్ సినిమాలో రాశీఖన్నా కన్ఫర్మ్..! ‘శ్లోక’గా ఫస్ట్ లుక్ రిలీజ్..!
మోహన్ బాబు మాట్లాడుతూ.. ‘రజనీకాంత్ గొప్ప మనిషి, అతడితో నాకు ఉన్న బంధం మాటల్లో చెప్పలేనిది. మా మధ్య స్నేహం 50 ఏళ్ల క్రితం మద్రాసు ప్లాట్‌ఫామ్‌పై తొలిసారి కలుసుకున్నప్పటి నుంచి, ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. అప్పట్లో ఇద్దరికి సినిమాల్లో అవకాశాలే లేవు. కానీ ఆ స్నేహం కాలాన్ని జయించి, నేటికీ అలాగే ఉంది. ఇప్పటికీ రోజుకు కనీసం మూడు, నాలుగు మెసేజ్‌లు ఒకరికొకరు పంపుకుంటూ ఉంటాం. ఇటీవల రజనీకాంత్‌ను కలిసినప్పుడు, ఆయన ఒక సలహా ఇచ్చారు.. నాకు గతంలో చాలా కోపం ఉండేది. కానీ పుస్తకాలు చదివిన తర్వాత ఆ కోపాన్ని వదిలేశాను. ‘‘నువ్వూ చదువు, కానీ చదవడం మాత్రమే కాకుండా అందులోని సారాంశాన్ని అర్థం చేసుకుని నీ కోపాన్ని వదిలేయ్.. అని రజనీకాంత్ చెప్పాడు. ఆ మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. అప్పటి నుండి కాస్త కోపం కూడా తగ్గింది’ అని ఆయన పేర్కోన్నారు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.
