Site icon NTV Telugu

పోలీసులను ఆశ్రయించిన సీనియర్ హీరో

Mohan Babu approached Cyber Police

టాలీవుడ్ సీనియర్ హీరో, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తాజాగా సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. ఇటీవల కాలంలో ఆయనను ట్రోల్ చేస్తున్న వారిపై పిర్యాదు చేయడానికి ఆయన పోలీసులను అశ్రయించినట్టు తెలుస్తోంది. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఉద్దేశపూర్వకంగా మోహన్ బాబు పరువు తీస్తున్నాయని మోహన్ బాబు న్యాయ సలహాదారు సంజయ్ సైబరాబాద్ పోలీసు విభాగానికి ఫిర్యాదు చేశారు.

Read Also : తెలంగాణ ప్రజలకు మెగాస్టార్ విషెస్

సదరు యూట్యూబ్ ఛానల్స్ వారి వ్యక్తిగత లాభాల కోసం మోహన్ బాబును ఎగతాళి చేస్తూ వీడియోలను షేర్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్న ఆ వీడియోలపై, వాటికి సంబంధించిన వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను కోరారు. మోహన్ బాబు ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తును మొదలుపెట్టారు. ఫిర్యాదులో వారు ఇచ్చిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పై ముందుగా చర్యలు తీసుకోనున్నారు. కాగా ప్రస్తుతం మోహన్ బాబు “సన్ ఆఫ్ ఇండియా” విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు.

Exit mobile version