Site icon NTV Telugu

Keeravani: ఇళయరాజా సంగీత దర్శకత్వంలో కీరవాణి రాసిన పాట..విన్నారా?

Ilai Keera

Ilai Keera

రూపేష్ కథానాయకుడిగా మా ఆయి (MAA AAI) ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన సినిమా ‘షష్టిపూర్తి’. నట కిరీటి డా. రాజేంద్ర ప్రసాద్, రెండు సార్లు జాతీయ ఉత్తమ నటి పురస్కారం గెలుచుకున్న అర్చన ప్రధాన తారాగణం. క్లాసిక్ ఫిల్మ్ ‘లేడీస్ టైలర్’ విడుదలైన 38 ఏళ్ళ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రమిది. ఆకాంక్షా సింగ్ ఇందులో రూపేష్ సరసన కథానాయికగా నటించారు. పవన్ ప్రభ దర్శకుడు. రూపేష్ చౌదరి నిర్మాత. ఈ సినిమాలోని ‘ఏదో ఏ జన్మ లోదో’ సాంగ్ త్వరలో విడుదల చేయనున్నట్లు న్యూ ఇయర్ సందర్భంగా వెల్లడించారు. ‘ఏదో… ఏ జన్మలోదో… ఈ పరిచయం’ సాంగ్ స్పెషాలిటీ ఏమిటంటే… ఇసైజ్ఞాని ఇళయరాజా సంగీతం అందించగా, ఆస్కార్ విజేత – ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సాహిత్యం సమకూర్చారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పవన్ ప్రభ మాట్లాడుతూ ”మా సినిమాలో ఐదు పాటలు ఉన్నాయి.

Pace Hospitals: మాదాపూర్ పేస్ హాస్పిటల్ లో దారుణం.. ఠాగూర్ సినిమా సీన్ రిపీట్

చైతన్య ప్రసాద్ గారు కొన్ని పాటలకు సాహిత్యం అందించారు. ప్రత్యేకమైన సందర్భంలో వచ్చే ఓ పాటకు కీరవాణి గారు అయితే బావుంటుందని అనిపించింది. చైతన్య ప్రసాద్ గారికి కీరవాణి గారు క్లోజ్. ఆయన ద్వారా అప్రోచ్ అయ్యాము. లక్కీగా ఆ టైంలో కీరవాణి గారు చెన్నైలో ఉన్నారు. లంచ్ టైంలో వెళ్లి కలిశాము. సిట్యువేషన్ చెప్పి సాంగ్ రాయమని రిక్వెస్ట్ చేయగా, ఓకే అన్నారు. మేం స్టూడియో‌కు తిరిగి వచ్చేసరికి పల్లవి రాసి పంపించారు. ఆ రోజే చరణం, తర్వాత రోజు మరో చరణం రాసి ఇచ్చారు. ఇళయరాజా గారి బాణీకి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి గారు సాహిత్యం అందించడం, అది మా సినిమాలో పాట కావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. నిజంగా ఇది మా చిత్ర బృందం చేసుకున్న అదృష్టం. కీరవాణి గారు ఇప్పటివరకూ 60 పై చిలుకు పాటలు రాశారు కానీ , ఇళయరాజా గారి బాణీ కి రాయడం ఇదే ప్రథమం. అది కూడా కీరవాణి గారు ఆస్కార్ గెలుచుకున్న తర్వాత రాయడం ఇంకా విశేషం ” అని అన్నారు.

Exit mobile version