గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది‘ ట్రైలర్ తో ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేసిన చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమా నుంచి హెల్లల్లల్లో అంటూ సాగే ఓ మాస్ డ్యాన్స్ నంబర్‌ను విడుదల చేసింది. ఈ సాంగ్‌తో సోషల్ మీడియాలో సినిమా బజ్ మరింత పెంచాలని చిత్ర బృందం ప్లాన్ చేసింది. అయితే ఈ పాటపై నెటిజన్ల నుంచి మిక్డ్స్ రెస్పాన్స్ వ్యక్తమవుతోంది.
పాట విడుదలైనప్పటి నుండి సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఈ పాటకు కొరియోగ్రఫీ అందించిన జానీ మాస్టర్ కంపోజ్ చేసిన కొన్ని స్టెప్స్ రొటీన్‌గా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ సాంగ్‌లో కనిపించిన సీనియర్ బ్యూటీ శృతి హాసన్ లుక్, మేకప్ స్టైల్ కూడా చాలా మందికి కనెక్ట్ కాలేదు. దీనిపై నెట్టింట రకరకాల ట్రోల్స్ కనిపిస్తున్నాయి. సినిమాలో మరో క్రేజీ హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా ఈ సాంగ్‌లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ సాదాసీదాగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ పాటపై పాజిటివ్ కామెంట్స్ కూడా గట్టిగానే వస్తున్నాయి. ముఖ్యంగా ఈ పాటలోని ‘హెల్లల్లల్లో’ అనే హుక్ లైన్ మరియు దానికి తగ్గ మ్యూజిక్ బిట్ మాస్ ఆడియన్స్‌ను, మ్యూజిక్ లవర్స్‌ను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎలాంటి టాక్ ఉన్నప్పటికీ.. రేపు థియేటర్లలో రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్, థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్, సినిమాలోని మాస్ ఎలిమెంట్స్ తోడైతే ఈ సాంగ్‌కు ఫ్యాన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ రావడం ఖాయమని మెగా అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. కానీ ఫస్ట్ గ్లిమ్స్ వచ్చినప్పడు ఉన్న హైప్ కు ఇప్పుడు ఉన్న హైప్ కాస్త తగ్గిందనేది మాత్రం వాస్తవం.
