NTV Telugu Site icon

Mimoh Chakraborty : టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇస్తున్న మిథున్ చక్రవర్తి కొడుకు

Mimo Chakravarty

Mimo Chakravarty

ప్రముఖ బాలీవుడ్ నటుడు, సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి, ఎయిర్ టెల్ ఫేం సాషా చెత్రి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘నేనెక్కడున్నా’. కేబీఆర్ సమర్పణలో మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాతో మాధవ్ కోదాడ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫిబ్రవరి 28న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు గంగాధర్, గోపీనాధ్ రెడ్డితో పాటు టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు.

హీరో మిమో చక్రవర్తి మాట్లాడుతూ ”ఈ ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుంది. ఫిబ్రవరి 28న విడుదలకాబోతున్న ఈ సినిమా కోసం ఎంతో ఎగ్జయిటెడ్‌గా ఎదురు చూస్తున్నాను. అందరూ చాలా గొప్పగా నటించారు. ఈ సినిమాకు మెయిన్ హీరో మాధవ్‌ గారు. మా నాన్నగారిలా నేను కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో భాగమవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాను అందరూ థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నాన”ని అన్నారు.

హీరోయిన్ సాషా చెత్రి మాట్లాడుతూ ”అందరూ సమయం కేటాయించి ఈ వేడుకకు వచ్చినందుకు థ్యాంక్యూ. డైరెక్టర్ మాధవ్ గారికి ధన్యవాదాలు. చాలా గొప్ప సినిమా ఇది. మహిళలపై ఇలాంటి సినిమా, నేను ప్రధాన పాత్రలో నటించడం అంతా డ్రీమ్‌లా ఉంది. చిత్రీకరణ సమయంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేశాం. నేను ఈ దేశానికి చెందిన బిడ్డను, అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ”ఇందులో నటించిన సషా భారతదేశం మొత్తానికి తెలుసు. 4జీ యాడ్‌తో ఆమె అందరికీ పరిచయమైంది. ఆ యాడ్‌తో మారుమూల పల్లెటూళ్లలో కూడా ఆమె మంచి పాపులరిటీని సొంతం చేసుకున్న సషా ఇందులో హీరోయిన్‌గా నటించింది.ట్రైలర్ కూడా చాలా బాగుంది. హీరో మిమో చక్రవర్తి కూడా వాళ్ల నాన్న మిథున్ చక్రవర్తిలా తెలుగులోనే మొదటి సినిమా చేస్తున్నారు. ఆయనలానే ఈయన కూడా సక్సెస్ అవ్వాలని, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.