Mita Vashisht Casting Couch Allegations on Tollywood Director: సినీ పరిశ్రమలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అంశం గురించి ఇప్పటికే చాలామంది చాలాసార్లు ప్రస్తావించారు. శ్రీ రెడ్డి లాంటి వాళ్లయితే దానికి వ్యతిరేకంగా ఉద్యమం లాంటివి కూడా చేశారు. అయితే తాజాగా తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న క్యాస్టింగ్ కావచ్చు అనుభవాల గురించి బాలీవుడ్ నటి మితా వశిష్ట్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని పేర్కొన్న ఆమె అవకాశాలు ఇస్తామని చెప్పి హీరోయిన్స్ ని లొంగదీసుకుని సంస్కృతి తెలుగు సినిమాల్లో తాను చూశానని చెప్పుకొచ్చింది. చాలామంది మహిళలు క్యాస్టింగ్ కౌచ్ సమస్యతో తెలుగు సినీ పరిశ్రమలో బాధపడుతున్న వారే అయినా నిజాయితీగా నిక్కచ్చిగా మాట్లాడటంతో అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు చాలామందికి ఎదురు కావడం లేదని చెప్పుకొచ్చారు. నా మొదటి రెండు సినిమాలు సిద్దేశ్వరి, కస్స రెండిట్లో పూర్తిగా నగ్న సన్నివేశాలు చేశాను.
Keerthy Suresh: స్టార్ హీరోయిన్ బుగ్గలు కొరికేస్తున్న హీరో కొడుకు!
దర్శకుడు నిజాయితీతో పాటు సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందనుకుంటే నేను ఎంత దూరమైనా వెళ్లి పని చేస్తాను. నాకు లీడ్ రోల్స్ వచ్చినప్పుడు కూడా నేను వాటిని తిరస్కరించిన పరిస్థితులు ఉన్నాయి. దానికి కారణం క్యాస్టింగ్ కౌచ్ అని అర్థం వచ్చేలా ఆమె కామెంట్ చేసింది. తెలుగు నుంచి ఒక దర్శకుడు నాకు కాల్ చేసి చెన్నైలో కలిశాడు. నాకు సినిమాలో హీరోయిన్ అవకాశం ఇస్తాను కానీ దానికి బదులు తనతో రెండు నెలలు కలిసి ఉండాలని కండిషన్ పెట్టాడు. నిజానికి అతను అప్పటికే తెలుగులో అవార్డులు సంపాదించిన దర్శకుడు. ఆ పాత్ర అద్భుతమైనదని కూడా చెప్పాడు.
అయితే కలిసి ఉండాలని చెప్తే నాకు మొదట అర్థం కాలేదు, అర్థం అయిన తర్వాత బుల్షిట్ మీ పాత్ర మీ దగ్గరే ఉంచుకోండి, నాకు సెకండ్ థాట్ కూడా లేదని ముఖం మీద చెప్పాను. ముందు రెండు నెలలు ఉండాలంటే భాష రాదు కాబట్టి భాష నేర్చుకోవడానికి రెండు నెలలు అంటున్నాడేమో అనుకున్నాను. అదే విషయం అడిగితే లేదు నాతో గడపాలి జీవించాలని అన్నాడు. కానీ నాకు అలాంటి ఉద్దేశం లేదని ముఖం మీద చెప్పేశానని ఆమె అన్నారు. అతను తెలుగు సినీ పరిశ్రమలో గొప్పవాడు కావచ్చు, అతని హీరోయిన్లు అవార్డులు గెలవచ్చు కానీ నాకు నటన అంటే ఒక కళ దానికోసం ఎవరికీ లొంగాల్సిన అవసరం లేదు అంటూ ఆమె కామెంట్ చేసింది. అయితే ఆమె కామెంట్ చేసిన తెలుగు దర్శకుడు ఎవరు అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు.