Site icon NTV Telugu

Mirzapur Season 3: మీర్జాపూర్ 3 వచ్చేసింది గురూ!

Mirzapur 3

Mirzapur 3

Mirzapur Season 3 Full Series Now Available On Amazon Prine Video: మీర్జాపూర్ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఇప్పటికే రెండు సీజన్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ మీర్జాపూర్ సిరీస్ లోని మూడవ సీజన్ ఈరోజు తెల్లవారుజామున 12 గంటల నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. నిజానికి ఈ మీర్జాపూర్ మొదటి సీజన్ 2018 నవంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నెమ్మదిగా స్లో పాయిజన్ లాగా ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటిలో బాగా క్లిక్ అయింది. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ అయితే సిరీస్ లోని బూతులకు బాగా కనెక్ట్ అయ్యారు.

Anudeep:మాస్ మహారాజా సినిమా పాయె.. అనుదీప్ లైన్లోకి కుర్ర హీరో?

ఇక దీనికి సంబంధించిన రెండవ సీజన్ 2021 అక్టోబర్ లో వచ్చింది. మూడో సీజన్ రావడానికి మాత్రం సుమారు నాలుగేళ్లు పట్టింది. ఇక మూడవ సీజన్లో సుమారు పది ఎపిసోడ్లు ఉన్నాయి. గురుమిత్ సింగ్, ఆనంద్ అయ్యర్ ఈ సిరీస్ ని డైరెక్ట్ చేశారు. ఇక ఈ సిరీస్లో పంకజ్ త్రిపాఠి, అలీ ఫైజల్, శ్వేత త్రిపాఠి, రసిక దుగ్గల్, విజయవర్మ ఇషా తల్వార్ వంటి వాళ్ళు కీలక పాత్రలలో నటించారు. ఉత్తర ప్రదేశ్ లోని ఒక ఊహాజనిత మీర్జాపూర్ అనే ప్రాంతంలో ఈ కథ మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఒక గ్యాంగ్ స్టార్ డ్రామా సిరీస్ గా తెరికెక్కిన ఈ మూడవ సీజన్ ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకోబోతోంది అనేది చూడాలి.

Exit mobile version