Site icon NTV Telugu

OG : పవన్ కళ్యాణ్ ‘OG’ కోసం మిరాయ్ టీం సంచలన నిర్ణయం..

Og (2)

Og (2)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజి సినిమా మరికొద్ది గంటల్లో ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో  తేజ సజ్జా హీరోగా నటించిన మిరాయ్ టీం ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. నిజానికి, మిరాయ్ సినిమా సెప్టెంబర్ 12వ తేదీన రిలీజ్ అయి, ఇప్పటికీ మంచి జోష్ కనబరుస్తోంది. చాలా చోట్ల ఇప్పటికీ హౌస్‌ఫుల్స్ నడుస్తున్నాయి. అయితే, ఇప్పుడు పవర్ స్టార్ ఓజి సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Also Read : Lady Super Star : ఒకప్పుడు యాడ్స్, ప్రమోషన్లకు నో.. ఇప్పుడు గ్రీన్ సిగ్నల్స్.. ఇంతలో ఎన్ని మార్పులో

అదేమిటంటే, రేపు మిరాయ్ ఆడుతున్న అన్ని సినిమా థియేటర్ల స్క్రీన్‌లను ఓజి సినిమాకి కేటాయించబోతున్నారు. ఇప్పుడు ఓజి సినిమాకి రిలీజ్ రోజైన గురువారం నాడు అన్ని థియేటర్లని కేటాయించి, మళ్లీ శుక్రవారం నుంచి మిరాయ్ సినిమా ప్రదర్శించేలా చర్యలు తీసుకున్నారు. మిరాయ్ సినిమా ఇప్పటికే రూ. 150 కోట్ల దిశగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో పవన్ కల్యాణ్ మీద గౌరవంతోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు నిర్మాత విశ్వప్రసాద్. మళ్లీ శుక్రవారం నుంచి యధావిధిగా మిరాయ్ సినిమాను ప్రేక్షకుల వీక్షించవచ్చు. సినిమాకి అదనంగా ఆడియన్స్ అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న వైబ్ ఉంది సాంగ్ కూడా నిన్ననే జోడించిన సంగతి తెలిసిందే. ఒక రకంగా, ఇది ప్రస్తుత ఇండస్ట్రీలో హెల్తీ కాంపిటీషన్ అని చెప్పుకోవచ్చు. తమ హీరో సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు మిరాయ్ టీమ్ కు అలాగే పీపుల్స్ మీడియా నిర్మాత విశ్వప్రసాద్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు పవర్ స్టార్ అభిమానులు.

Exit mobile version