Site icon NTV Telugu

తన విడాకుల వ్యవహారంపై స్పందించిన మినీషా లాంబా…

Minissha Lamba on her divorce with husband

బాలీవుడ్ లో పెళ్లిల్లు, విడాకులు రెండూ కామనే! అయితే, కొందరు పెళ్లిని సీరియస్ గా తీసుకుని పర్మనెంట్ గా ఒకరికి ఒకరు మిగిలిపోతే మరికొందరు డైవోర్స్ ఆప్షన్ ఎంచుకుంటారు. అయితే, ఎవ్వరూ హ్యాపీగా ఉన్న మ్యారేజ్ ని కావాలని బ్రేక్ చేసుకోరు కదా? కలసి ఉండలేనంత స్థితి వచ్చినప్పుడు విడిపోవటమే బెటర్ అంటోంది మినీషా లాంబా.

‘బచ్ నా హై హసీనో’ సినిమాలో తళుక్కుమన్న మిస్ లాంబా చాలా చిత్రాల్లోనే నటించింది. కొన్ని టెలివిజన్ షోస్ కూడా చేసింది. అయితే, 2015లో ఆమె రయాన్ థామ్ ను పెళ్లాడింది. 2020 దాకా వాళ్ల రిలేషన్ కొనసాగింది. పోయిన సంవత్సరం మినీషా భర్త నుంచీ విడిపోయింది. అయితే, ఆమె రీసెంట్ గా తన డైవోర్స్ వ్యవహారంపై నోరు విప్పింది. ఓ ఇంటర్వ్యూలో… ‘’గతంలో విడాకుల్ని మన వాళ్లు అవమానంగా భావించే వారు. కానీ, ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. ఒకరితో ఒకరు కలసి ఉండటం సాధ్యం కాకపోతే వీడిపోతున్నారు. ఇంతకు ముందైతే స్త్రీ మీదే పూర్తిగా భారం ఉండేది. ఆమె ఎన్నో త్యాగాలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆడవాళ్లు స్వతంత్రంగా బతకగలుగుతున్నారు. అందుకే, ఇష్టం లేకుండా కలసి ఉండటం కంటే విడిపోవటం బెటర్!’’ అనే అర్థం వచ్చేలా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

మినీషా లాంబా చివరి చిత్రం సంజయ్ దత్, అదితి రావ్ హైదరీ నటించిన ‘భూమి’. మళ్లీ మినీషా సినిమాల్లో కనిపిస్తుందో లేదో చూడాలి మరి…

Exit mobile version