విజయ్ దేవరకొండ హీరోగా రాబోతోన్న స్పోర్ట్స్ యాక్షన్ ‘లైగర్’ (సాలా క్రాస్ బ్రీడ్) చిత్రంతో లెజెండ్ మైక్ టైసన్ ఇండియన్ స్క్రీన్ మీద కనిపించబోతోన్నారు. ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు. మైక్ టైసన్ ఈ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టడంతోనే అంచనాలు ఆకాశాన్నంటాయి. మంగళవారం అమెరికాలో ప్రారంభించిన కొత్త షెడ్యూల్‌లో మైక్ టైసన్ జాయిన్ అయ్యారు.
మైక్ టైసన్ సింప్లిసిటీ చూసి విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్‌లతో పాటు చిత్రయూనిట్ అంతా ఆశ్చర్యపోయింది. మైక్ టైసన్ మన భారతీయ వంటకాలను మెచ్చుకున్నారు. ఆయనకు ఎంతో ఇష్టమైన వంటకాల గురించి అడిగారు. మైక్ టైసన్, ఆయన భార్య కికి కోసం స్పెషల్‌గా భోజన ఏర్పాటు చేసింది లైగర్ టీం. గార్లిక్ నాన్, బటర్ చికెన్, తందూరి చికెన్, ఫిష్ టిక్కా మసాలా, గోట్ బిర్యానీ లాంటి స్పెషల్ ఐటమ్స్‌తో లంచ్ ఏర్పాటు చేశారు. ఆలూ గోబీ, పాలక్ పన్నీర్, సమోస, కబాబ్స్‌లను మైక్ టైసన్ స్పెషల్‌గా అడిగారట! ఇండియన్ వంటకాల మీద టైసన్‌కు ఉన్న మక్కువ చూసి చిత్ర యూనిట్ ఆశ్చర్యపోయిందని తెలుస్తోంది. చిత్రయూనిట్ ప్రేమగా వడ్డించడం, అతిథి మర్యాదలను చూసి మైక్ టైసన్ ముచ్చటపడ్డారట.
