NTV Telugu Site icon

Mia Khalifa: మోసం చేసి పోర్న్ స్టార్ ని చేశాడు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన మియా ఖలీఫా

Mia Khalifa

Mia Khalifa

Mia Khalifa Reveals the Facts Becoming Adult Star: మియా ఖలీఫా చాలా పాపులర్ పోర్న్ స్టార్. అయితే, ఆమె ఇప్పుడు అడల్ట్ ఇండస్ట్రీని వదిలి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారింది. అయితే ఆమె పోర్న్ స్టార్ ఎలా అయిందో తెలుసా? ఆమె పూర్తి కథ మీకోసం. ఒకప్పుడు అత్యంత పాపులర్ పోర్న్ స్టార్‌లలో ఒకరిగా ఉన్న మియా ఖలీఫా ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఉంది. అయితే తాను పోర్న్ స్టార్ అవ్వాలని ఎప్పుడూ కోరుకోలేదని చెప్పింది. మియా ఖలీఫా చెబుతున్న దాని ప్రకారం, ఆమె తన కెరీర్‌ను మోడల్‌గా ప్రారంభించింది. ఒక మోడలింగ్ అసైన్‌మెంట్ ఆమెను ఈ పోర్న్ ఊబిలోకి నెట్టేసిందట. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మియా నేను పోర్న్ చేయడానికి ఎవరి అంగీకారం పొందలేదు. మీరు చాలా అందంగా ఉన్నారు, న్యూడ్ మోడలింగ్ చేయమని అడిగారు. మియా చెబుతున్న దాని ప్రకారం, ‘మీ శరీరం అందంగా ఉంది, మీరు న్యూడ్ మోడలింగ్ చేయాలని అడిగారట.

Ragini Dwivedi : వాష్‌రూమ్‌కి వెళ్లలేక, బట్టలు మార్చుకోలేక నరకం.. రాగిణి సంచలన వ్యాఖ్యలు

శరీరాన్ని టచ్ చేయరు కదా, నగ్నంగా చూపించడంలో తప్పేముంది అనుకుని అలా న్యూడ్ మోడలింగ్ మొదలు పెట్టా. నేను స్టూడియోకి వెళ్ళినప్పుడు ప్రతిదీ గౌరవప్రదంగా ఉంది. అందరూ బాగున్నారు, ఎటువంటి సందేహం రాలేదు. ఇక న్యూడ్ మోడలింగ్ కాంట్రాక్ట్ సంతకం చేయడానికి వెళ్లి అగ్రిమెంట్ చదవకుండానే పోర్న్ సినిమాపై సంతకం చేసిందట. న్యూడ్ మోడలింగ్ పేరుతో అడల్ట్ వీడియోలు చేయించేందుకు ఆమెను మోసం చేశారు. నన్ను ఉపయోగించుకునేందుకు కుట్ర జరుగుతోందని తెలిసి అధైర్యపడకుండా నీలి చిత్రాల్లో నటించాను. అప్పుడు నేను నా స్వంత నిర్ణయాలు తీసుకున్నాను. కొద్ది రోజుల్లోనే పోర్న్‌స్టార్‌గా మారా, జనంలోకి వెళ్లినప్పుడు చాలా చెడ్డగా చూసేవారు. దీంతో ఒత్తిడికి గురై అనారోగ్యానికి గురయ్యానని ఆమె పేర్కొంది. మియా ఖలీఫా 21 ఏళ్ల వయసులో 2014లో పోర్న్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే మూడు నెలల తర్వాత అందులోంచి బయటపడింది. అయితే ఆమె X-రేటెడ్ వీడియోలు ఇప్పటికీ చాలా వైరల్ అవుతూనే ఉంటాయి.

Show comments