‘హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్ నటించిన తాజా సినిమా ‘మెరిసే మెరిసే’.. పవన్ కుమార్ కె. దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కొత్తూరి ఎంటర్టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై వెంకటేష్ కొత్తూరి నిర్మించారు. శ్వేతా అవస్తి హీరోయిన్ గా నటించింది. ఇటీవలే సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ ఇచ్చారు. లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం పీవీఆర్ పిక్చర్స్ ద్వారా ఆగస్టు 6న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.
కాగా, నేటి నుంచి థియేటర్లు ఓపెన్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 23 నుంచి కొత్త సినిమాలు విడుదల కానున్నాయి. ఏపీలోను థియేటర్ల తెరిచే అంశంపై అతిత్వరలోనే స్పష్టత రానుంది.
ఆగస్టు 6న థియేటర్లలో ‘మెరిసే మెరిసే’ చిత్రం
