Site icon NTV Telugu

‘ఫేవరెట్ టీం’ అంటూ వాళ్ళతో మెహ్రీన్… పిక్ వైరల్

Mehreen, Mehreen-Bhavya Bhishnoi Break Up, F3, Mehreen Pirzada

రాజకీయ నాయకుడు భవ్య బిష్ణోయ్ తో తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుని అందరికీ షాకిచ్చిన టాలీవుడ్ బ్యూటీ మెహ్రీన్ తాజాగా షేర్ చేసిన పిక్ లో హ్యాపీగా కన్పించింది. మెహ్రీన్ ప్రస్తుతం తాను నటిస్తున్న “ఎఫ్ 3” షూటింగ్ సెట్లో వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, సునీల్ ఇతరులతో కలిసి ఉన్న పిక్ ను షేర్ చేసుకుంది. “నా ఫేవరెట్ ఎఫ్ 3 ఫ్యామిలీలోకి తిరిగి వచ్చాను” అంటూ కామెంట్ చేసింది. ఈ పిక్స్ లో ఆమె అందమైన మినీ డ్రెస్ లో స్టన్నింగ్ గా కనిపిస్తుంది. కాగా వారి బ్రేకప్ కు కారణం ఆమె పెళ్ళైన తరువాత కూడా సినిమాల్లో నటించాలని నిర్ణయం తీసుకోవడం అనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె సినిమా సెట్స్ లో హ్యాపీగా ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Read Also : ఆ డ్రెస్ లో దేవకన్యలా మిల్కీ బ్యూటీ !!

2019లో వచ్చిన “ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్టేషన్”కు రీమేక్ గా ‘ఎఫ్ 3’ తెరకెక్కుతోంది. ఈ సీక్వెల్ లో అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వెంకటేష్ దగ్గుబాటి, వరుణ్ తేజ్, తమన్నా భాటియా, మెహ్రీన్ ఫిర్జాద తిరిగి తమ పాత్రలను పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు “ఎఫ్ 3” ని నిర్మిస్తున్నారు. ఈసారి ఇందులో సునీల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా, దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్ర సంగీతం దర్శకుడిగా పని చేస్తున్నారు.

Exit mobile version