మహబూబ్ దిల్ సే, శ్రీ సత్య కలిసి చేసిన ప్రైవేట్ ఆల్బమ్ యూత్ ఫుల్ సాంగ్ నువ్వే కావాలి లాంచ్ అయింది. ఈ పాటకు సురేష్ బనిశెట్టి లిరిక్స్ అందించగా, భార్గవ్ రవడ డిఓపి, ఎడిటింగ్ మరియు డైరెక్షన్ అన్ని తానయ్యి ఈ సాంగ్ చిత్రీకరించారు. ఈ సాంగ్ మనీష్ కుమార్ మ్యూజిక్ అందించి పాట పాడగా, వైషు మాయ ఫిమేల్ వాయిస్ కి ఆయనతో జతకట్టారు. యూరోప్ లోని లోని బార్సిలోన, మెక్సికో మరియు పారిస్ వంటి అద్భుతమైన లొకేషన్స్ లో అందంగా చిత్రీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సోహెల్, నోయల్, రాహుల్ సిప్లిగంజ్, రోల్ రైడా, గౌతమ్ కృష్ణ, ప్రియాంక, సిరి హనుమంత్, గీతు రాయల్ మరియు ఇతర బిగ్ బాస్ సెలబ్రిటీలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ సత్య మాట్లాడుతూ ఈ సాంగ్ రిలీజ్ కోసం అప్పటి నుంచి ఎదురు చూస్తున్నా,కచ్చితంగా ఈ సాంగ్ అందరికీ నచ్చుతుంది. మెహబూబ్ తో కలిసి సాంగ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మహబూబ్ మాట్లాడుతూ ఈ సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు బాగుందని ప్రశంసిస్తున్నారు. ప్రేక్షకులు కూడా ఈ సాంగ్ ని ఆదరించి పెద్ద సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. ఇక ఈ సాంగ్ కోసం 50 లక్షలకు పైగా ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో #4 ట్రేండింగ్ లో ఉంది.