NTV Telugu Site icon

Megha Akash: పొలిటికల్ ఫ్యామిలీ కుర్రాడిని లవ్ మ్యారేజ్ చేసుకున్న హీరోయిన్.. ఎవరో తెలుసా?

Megha Akash

Megha Akash

Megha Akash Husband Vishnu Sai Background Details: టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాష్‌ రజనీకాంత్‌తో ‘పెట్టా’ సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో ఆమె ఒక సైడ్ రోల్ పోషించింది. తరువాత సంవత్సరం నటుడు ధనుష్ సరసన ఎనై నోకి పాయుమ్ తోటలో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత తమిళంలో విజయ్ సేతుపతి, శింబు వంటి ప్రముఖ నటుల సరసన నటించిన మేఘా ఆకాష్ తెలుగు, మలయాళ చిత్రాల్లోనూ నటించింది. అయితే ఇదిలా ఉండగా మాజీ మంత్రి తిరునావుకరసర్‌ కుమారుడు సాయివిష్ణుతో ఆమె ప్రేమలో పడింది. వీరు గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గత నెలలో చెన్నైలో సాయి విష్ణు, మేఘా ఆకాష్ నిశ్చితార్థం జరిగింది.

Jani Master: మతం మారాలని దాడి.. పార్శిల్ వార్నింగ్.. వెలుగులోకి సంచలనాలు!!!

తర్వాత నిన్న చెన్నైలో మేఘా ఆకాష్-సాయివిష్ణు జంట వివాహ రిసెప్షన్ జరిగింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, మంత్రులు ఉదయనిధి స్టాలిన్, అన్బిల్ మహేష్, కేకేఎస్సార్ రామచంద్రన్ సహా పెద్ద సంఖ్యలో రాజకీయ నేతలు హాజరయ్యారు. ఆ తర్వాత మేఘా ఆకాష్ – సాయి విష్ణు జంట వివాహం కూడా నిన్న ఘనంగా జరిగింది. బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. సాయివిష్ణు తన ప్రేమించిన భార్యకు తాళి కట్టి ముద్దుపెట్టి తన ప్రేమను చాటుకున్నాడు. బాయ్‌ఫ్రెండ్‌తో ఏడడుగులు వేసిన నటి మేఘా ఆకాష్‌కి సోషల్ మీడియాలో అభినందనల వర్షం కురుస్తోంది. అలాగే ఆమె పెళ్లి ఫోటోలు కూడా విడుదలై ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తానని నటి మేఘా ఆకాష్ చెప్పడం గమనార్హం.

Show comments