Chiranjeevi : సురేఖే నా సర్వస్వం.. 44 ఏళ్ల బంధంపై మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్!

Chiranjeevi Wife Surekha Birthday

Chiranjeevi Wife Surekha Birthday

మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రపంచానికి ఒక పెద్ద సినిమా స్టార్. కానీ ఆయన దృష్టిలో తన ప్రపంచమంతా తన భార్య సురేఖ. తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది. తన 44 ఏళ్ల వైవాహిక జీవితంలోని తీపి జ్ఞాపకాలను, తన భార్య గొప్పతనాన్ని ఆయన ఈ పోస్ట్‌లో వివరించారు.

Also Read : Riya Shibu : సూర్య-జ్యోతిక నుంచి స్పెషల్ గిఫ్ట్.. గాల్లో తేలిపోతున్న ‘సర్వం మాయ’ నటి రియా!

‘సురేఖను నా ప్రశాంతత, సపోర్ట్ సిస్టమ్, కుటుంబానికి బలమైన పునాది. నేను షూటింగ్‌లతో బిజీగా ఉన్నప్పుడు, ఇంటి బాధ్యతలన్నీ తనే భుజాన వేసుకుని కుటుంబాన్ని ఏకం చేసిన వంతెన సురేఖ. నా తల్లిదండ్రులను, తోబుట్టువులను తన సొంతవారిలా చూసుకుంటూ.. కోడలిగా కంటే ఒక కూతురిలా వారి మనసు గెలుచుకుంది. లోకం నా సక్సెస్‌ను టాలెంట్ లేదా కష్టం అని అనుకుంటుంది.. కానీ నా ప్రతి విజయంలోనూ సురేఖ వంతు ఉంది. తను ఇంట్లో అన్ని బాధ్యతలు మోసింది కాబట్టే, నేను కెమెరా ముందు ఇంతగా మెరవగలిగాను” అంటూ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. తన జీవితాంతం ఆమెకు రుణపడి ఉంటానని చిరంజీవి చేసిన ఈ పోస్ట్ మెగా ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.