NTV Telugu Site icon

భయమే చంపుతుంది… పానిక్ కావద్దు: చిరంజీవి

Megastar Chiranjeevi Video on Covid-19

కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. మన తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే లాక్ డౌన్ కూడా ప్రకటించారు. అయినా కొంత మంది ఊసుపోక వీధుల్లో తిరుగుతున్నారు. ఇక ఎంతో మంది జనాలు ఈ మహమ్మారి బారిన పడి ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇదే విషయాన్ని ట్వీట్ చేస్తూ… ‘ఈ వైరస్ నుండి కోలుకోవడానికి చాలా టైమ్ పడుతోంది. అలక్ష్యం చేయకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటినుంచి బయటకు రాకండి. తప్పని సరిగా మాస్క్ ధరించండి. వీలైతే డబుల్ మాస్క్ వేసుకోండి. వాక్సినేషన్ తీసుకోండి. దీని వల్ల కరోనా సోకినా ప్రభావం తక్కుగా ఉంటుంది. పాజిటీవ్ వచ్చినా పానిక్ కావద్దు. మన భయమే మనలను చంపుతోంది. పాజిటీవ్ వస్తే ఐసోలేషన్ లోకి వెళ్ళి డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడండి. నలత, ఊపిరి సమస్యలు తలెత్తితే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి. హాస్పటిల్ లో చేరండి. కరోనా నుంచి కోలుకున్న తర్వాత మీ బాడీలో యాండీ బాడీస్ ఉత్పత్తి అవుతాయి. ప్లాస్మా డొనేట్ చేస్తే కరోనా నుంచి కనీసం ఇద్దరిని కాపాడినవారు అవుతారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కుటుంబాన్ని, మన ఊరిని, తద్వారా మన దేశాన్ని కాపాడుకుందాం’ అటూ పిలుపు నిచ్చారు.