Megastar Chiranjeevi Met Chandrababu Naidu at His Residence: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ఈ రోజు హైద్రాబాద్ లోని ఆయన నివాసం లో కలిశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలతో వరదలు సంభవించి ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ తమ వంతుగా ప్రభుత్వానికి మద్ధతుని ప్రకటిస్తూ విరాళాలను అందజేసింది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న ప్రతీసారి సినీ పరిశ్రమ నుంచి తన వంతు మద్ధతుని చిరంజీవి అండ్ ఫ్యామిలీ తెలియచేస్తుంటుందనే సంగతి తెలిసిందే.